Sunday, May 12, 2024
- Advertisement -

రిప‌బ్లిక్ స‌ర్వే ఫ‌లితాలు… టీడీపీ మూటా ముళ్లె స‌ర్దుకోవాల్సిందే

- Advertisement -

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌లు స‌మీపిస్తున్న కొద్దీ రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు శ‌ర‌వేగంగా మారుతున్నాయి. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అధికారాన్ని ద‌క్కించుకోవ‌డంకోసం వైసీపీ, టీడీపీ విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ఇక జ‌గ‌న్ అయితే పాద‌యాత్ర ద్వారా జ‌నంలో దూసుకు పోతున్నారు. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌డుతూ అధికారంలోకి వ‌స్తే ప్ర‌జ‌ల‌కు న‌వ‌ర‌త్నాల ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తామ‌ని ప్ర‌క‌టిస్తున్నారు. ఇక స్థానిక స‌మ‌స్య‌ల‌పై కూడా జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌కు ఒక స్ప‌ష్ట‌మైన భ‌రోసానిస్తూ ముందుకు సాగుతున్నారు.

రోజు రోజుకీ జ‌గ‌న్ చేస్తున్న పాద‌యాత్ర‌కు వ‌స్తున్న అపూర్వ స్పంద‌న‌ను చూస్తే టీడీపీకీ దిమ్మ‌తిరిగి బొమ్మ‌క‌నిపించ‌డం కాయంగా తెలుస్తోంది. పాద‌యాత్ర ప్ర‌భావం వల్ల బాబు రాజ‌కీయ స‌మీక‌ణాలు త‌ల క్రిందుల‌వుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగోలా జిమ్మిక్కులు చేసి మ‌రో సారి అధికారంలోకి రావాల‌నుకున్న బాబు ఆశ‌లు అడియాశ‌ల‌య్యేలా స‌ర్వేల ఫ‌లితాలు వ‌స్తున్నాయి.

ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీలో చేసిన అన్ని స‌ర్వేల్లో ఎ వైసీపీనే అధికారంలోకి వ‌స్తుంద‌ని ఫ‌లితాలు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. గ‌తంలో 2019 సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని దేశవ్యాప్తంగా ఉన్న పార్లమెంట్ స్థానాల్లో జర్నలిస్టు అర్నబ్ గోస్వామి ఆధ్వర్యంలోని రిపబ్లికన్ టీవీ- సీ ఓటర్ సర్వే నిర్వ‌హించింది. ఆ ఫ‌లితాల్లో ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-బీజేపీ కూటమికి 12 పార్లమెంట్ స్థానాలు. వైసీపీకీ 13 స్థానాలు వ‌స్తాయ‌ని అంచ‌నా వేసింది.

అయితే తాజ‌గావారి అంచ‌నాలు త‌ల‌క్రిందుల‌య్యాయి. ఏపీలో ఉన్న 25 సీట్ల‌కు గానూ తాజా స‌ర్వేలో వైసీపీకీ 21 ఎంపీ సీట్లు వ‌స్తాయ‌ని తేల్చి చెప్పింది రిప‌బ్లిక‌న్ టీవీ స‌ర్వే. అధికార పార్టీ మైండ్ గేమ్‌కు చిత్తవుతున్న వేళ.. తమ పార్టీకే ప్రజాదరణ దక్కుతుందని కథనం రావడం అటు జ‌గ‌న్‌కు ఇటు పార్టీ శ్రేణుల‌కు పెద్ద బూస్టప్ ఇచ్చినట్లే. మ‌రి ఫ‌లితాలు ఎలా ఉంటాయ‌నేది వేచి చూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -