Wednesday, May 8, 2024
- Advertisement -

బిగ్‌బాస్‌ను గెలుచుకున్న …కొనుక్కోలేదు – కౌశ‌ల్‌

- Advertisement -

బిగ్‌బాస్ రెండో సీజ‌న్ విన్న‌ర్ కౌశ‌ల్ బిగ్‌బాస్ టైటిల్ గురించి మాట్లాడుతు ప‌లు ఆసక్తిక‌ర‌మైన వాఖ్య‌లు చేశారు.ప్ర‌ముఖ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో కౌశ‌ల్ మాట్లాడుతు నేను బిగ్‌బాస్ టైటిల్‌ను లాక్కోలేదు, అంద‌రు మ‌న‌స్సులని గెలుచుకుని టైటిల్ సాధించ‌న‌ని తెలిపాడు.యాంక‌ర్ అడిగిన ప్ర‌శ్న‌కు సమాధానం ఇస్తు కౌశ‌ల్‌… మీకు నేను టైటిల్‌ను గెలుచుకున్నట్టుగా అనిపించిందా? లాక్కున్నట్టు అనిపించిందా? అని కౌశల్ యాంక‌ర్‌ని అడిగాడు. దీనికి స‌ద‌రు యాంక‌ర్ కూడా మీ ఆట నాకు బాగా న‌చ్చిందని కౌశ‌ల్‌తో చెప్ప‌డం జ‌రిగింది.

‘నా ఆట మీకు నచ్చింది కనుక ..బిగ్‌బాస్ -2 టైటిల్‌ను నేను గెలుచుకున్నాననే అనుకోవచ్చని తెలిపాడు కౌశ‌ల్‌. ఇక ఈ షోలో తోటి హౌస్‌మెట్స్ గురించి కూడా చెప్పుకొచ్చాడు.గీతా మాధురినే నాకు పోటీనిస్తుంద‌ని మొద‌టి నుంచి భావించాన‌ని,నేను అనుకున్న‌ట్లే నాతో పాటు గీతా గారు కూడా టైటిల్ కోసం పోటీ ప‌డ్డార‌ని చెప్పుకొచ్చాడు.40 కోట్ల ఓట్లు రావ‌డం వల్లే నేను బిగ్‌బాస్ విన్న‌ర్‌గా నిలిచాన‌ని చెప్పాడు కౌశ‌ల్‌.త‌నకు ఓట్లు వేసిన ప్ర‌తి ఒక్క‌రికి ధ‌న్య‌వాదాలు తెలిపాడు కౌశ‌ల్‌.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -