Wednesday, May 1, 2024
- Advertisement -

రేణు దేశాయ్ వ‌స్తే బిగ్‌బాస్‌కు రేటింగ్ వ‌స్తుందా..? కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

- Advertisement -

గ‌త రెండు సీజ‌న్ల‌ను దిగ్వ‌జ‌యంగా పూర్తి చేసుకున్న తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ మూడో సీజన్‌కు రెడీ అయింది. తెలుగులో మొట్ట‌మొద‌టి రియాల్టీ షోగా పేరుగాంచిన బిగ్‌బాస్ ఇక్క‌డ సూప‌ర్ హిట్ అయింది. మొద‌టి సీజన్‌కు మించి రెండో సీజ‌న్ హిట్ అవ్వ‌డందో మూడో సీజ‌న్‌కు రంగం సిద్ధం చేస్తున్నారు బిగ్‌బాస్ నిర్వ‌హకులు. తాజాగా మూడో సీజ‌న్‌కు సంబంధించిన కంటెస్టెంట్ల పేర్లు కొన్ని బ‌య‌టికి వ‌చ్చాయి.మూడో సీజ‌న్‌కు సంబంధించి బాగా వినిపిస్తున్న పేరు రేణు దేశాయ్‌. న‌టుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మాజీ భార్యే రేణు దేశాయ్. ఈ సీజ‌న్‌లో రేణు దేశాయ్‌ను తీసుకురావ‌డం వ‌ల్ల షోకి రేటింగ్స్ తీసుకురావ‌చ్చ‌ని భావిస్తోంది బిగ్‌బాస్ యాజ‌మాన్యం. గ‌త సీజ‌న్‌లో గుర్తింపు లేని ఆర్టిస్ట్‌ల‌ను తీసుకువ‌చ్చార‌నే కామెట్స్ వినిపించాయి. మూడో సీజ‌న్‌లో ఇటువంటి కామెంట్స్ వినిపించ‌కూడ‌ద‌నే ఉద్దేశంతో ఉంది బిగ్‌బాస్‌. మూడో సీజ‌న్‌లో పేరున్నా ఆర్టిస్ట్‌ల‌ను తీసుకునే ఆలోచ‌న‌లో ఉంద‌ట బిగ్‌బాస్ యాజ‌మాన్యం. రేణు దేశాయ్‌తో పాటు ఈ లిస్ట్‌లో మ‌రి కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి.

ఆ లిస్ట్‌లో ఎవ‌రెవ్వ‌రి పేర్లు ఉన్నాయో ఓ సారి చూద్దాం. యాంక‌ర్ ఉద‌య భాను,శోభిత ధూళిపాల‌,గ‌ద్దె సింధుర‌, యూట్యూబ్ స్టార్ జాహ్న‌వి,వ‌రుణ్ సందేశ్‌, జాకీ, క‌మ‌ల్ క‌మ‌రాజు,హేమ‌చంద్ర‌, ర‌ఘు మాస్ట‌ర్ వంటి వారి పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి. గ‌త సీజ‌న్‌లో ఎవ‌రు ముందు ఎలిమినేట్ అవుతున్నార‌నే విష‌యం ముందుగానే తెలిసిపోవ‌డంతో, ఈ సారి అలా జ‌ర‌గ‌కుండా ముందుగానే జాగ్ర‌త్తలు తీసుకుంటున్నార‌ని స‌మాచారం. అయితే ఈ మూడో సీజ‌న్ కంటెస్టెంట్లు వీరే అని వ‌స్తున్న పేర్లు కేవ‌లం మీడియాలో వ‌స్తున్నావే ,కాని ఈ పేర్ల‌ను బిగ్‌బాస్ యాజ‌మాన్యం ధృవిక‌రించ‌లేదు. ఇక మూడో సీజ‌న్‌లో ఎవ‌రు హోస్ట్‌గా వ‌హిస్తారో ఇంకా తెలియ‌లేదు. బిగ్‌బాస్ మూడో సీజ‌న్‌లో సీనియ‌ర్ యాక్ట‌ర్ వెంకీని తీసుకోవాల‌ని యాజ‌మాన్యం భావిస్తోందని గ‌త కొద్ది రోజులుగా మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -