Tuesday, May 7, 2024
- Advertisement -

ఫిబ్ర‌వ‌రిలో అమ‌రావ‌తికి మ‌కాం మార్చ‌నున్న‌ జ‌గ‌న్

- Advertisement -

ఈ మూడు, నాలుగు నెలు ఏపీలో ఎన్నిక‌ల స‌మ‌రం. అన్ని పార్టీలు పోటీకీ సై అంటే సై అంటున్నాయి. ఇప్ప‌టికే జ‌న‌సేన‌, వైసీపీ లు ఎవ‌రితోనూ పొత్తు పెట్టుకోమ‌ని ఒంట‌రిగానే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తామ‌ని ప్ర‌క‌టించాయి. వైసీపీతో జ‌న‌సేన పొత్తు పెట్టుకుంటోంద‌న్న ఊహాగాణాల‌కు జ‌గ‌న్ చెక్ పెట్టారు. సింహం సింగిల్ గానే ఎన్నిక‌ల‌కు వెల్తుంద‌ని మ‌రో సారి క్లారిటీ ఇచ్చారు.

ఈనెల 9న ఇచ్చాపురంలో జ‌రిగే భారీ బ‌హిరంగ స‌భ‌తో జ‌గ‌న్ చేప‌ట్టిన పాద‌యాత్రకు శుభం కార్డు ప‌డ‌నుంది. అక్క‌డినుంచి ప్ర‌తి నిమిష‌మూ ఎంతో విలువైన‌ది. అభ్య‌ర్తుల ఎంపిక‌, ప్ర‌చారం కార్య‌క్ర‌మాల‌తో బిజీగా ఉంటారు. పాద‌యాత్ర ముగిసిన వెంట‌నే మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకోబోతున్నారు జ‌గ‌న్.

హైద‌రాబాద్‌లో ఉన్న వైసీపీ ప్ర‌ధాన కార్యాల‌యం నుంచే పార్టీ కార్య‌క్ర‌మాలు ఇప్ప‌టి వ‌ర‌కు చురుగ్గా జ‌రుగుతున్నాయి. ప్ర‌ముఖ నాయ‌కులంద‌రూ కూడా ఇక్క‌డి నుంచే రాజ‌కీయాలు చేస్తున్నారు. సొంత రాష్ట్రం నుండి కాకుండా మైద‌రాబాద్‌నుంచే జ‌గ‌న్ పార్టీ కార్య‌క్ర‌మాలు చేస్తున్నార‌న్న విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్ట‌నున్నారు. రాజ‌ధాని అమ‌రావ‌తిలో నిర్మిస్తున్న పార్టీ కార్యాల‌యం , ఇళ్లు పూర్తి కావ‌స్తున్నాయి. ఫిబ్ర‌వ‌రిలో జ‌గ‌న్ త‌న రాజ‌కీయ కార్య‌క‌లాపాల‌ను హైద‌రాబాద్‌నుంచి అమ‌రావ‌తికి మార్చ‌నున్నారు. ఈ విష‌యాన్ని జ‌గ‌న్ స్వ‌యంగా ప్ర‌క‌టించారు. వ‌చ్చే నాలుగు నెలలు ఎన్నిక‌ల సీజ‌న్ కాబ‌ట్టి అక్క‌డి నుంచే రాజ‌కీయాలు చేయనున్నారు. ఇది వైసీపీ శ్రేణుల‌కు, కార్య‌క‌ర్త‌ల్లో జోష్ నింప‌నుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -