Wednesday, May 15, 2024
- Advertisement -

బిగ్ బాస్ షోలో అక్రమ సంబంధాలు..?

- Advertisement -

బిగ్ బాస్ షోలో వినోదం అసలు కనిపిచడం లేదని ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. ఫ్యామిలీ అంతా చూసే.. ఈ షోలో అక్రమ సంబంధాలను ప్రోత్సహించే విధంగా నడపడంపై ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని ఎపీసోడ్లు బానే ఉన్న.. ఇప్పుడు వెగటు పట్టించేలా చేస్తున్నారు. ఇటివలే ప్రసారం అయిన ఎపిసోడ్ చాలా నాసిరకంగా.. కనిపించింది. వినియోగదారులు, వసూలు దారులు అంటూ ఓ కాన్సెప్ట్‌తో సాగిన ఎపిసోడ్ చాలా నీరసంగా మారింది.

ఏదో ఒక విధంగా ఏపీసోడ్ ముగింఛేలా టైంపాస్ కోసం నడిపినట్లు అనిపించిది. నటనపరంగా శివబాలాజీ, హరితేజ లేకుండా ఆ కాస్తంతైనా అడల్డ్ కామెడీ పండేది కాదేమో. సైలెంట్ గా ఉంటున్న కల్పన ఇప్పుడిప్పుడే అందులో నుంచి బయటకు వస్తున్నట్లు కనిపిస్తోంది. కల్పన భర్తగా శివబాలాజీ బాగా నటించాడు. ధన్‍రాజ్ వైఫ్ గా ముమైత్ ఖాన్ నటించింది. పనిమనిషిగా హరితేజ కనిపించింది. శివబాలాజీ, ధన్‌రాజ్‌కు గాలం వేసే వంట మనిషిగా హరితేజ ఆకట్టుకొన్నది.

గోపి లోలా అంటూ పాట పాడుతూ.. ధన్‌రాజ్‌ను పిలిచే సీన్‌లో తెగ అలరించింది. కల్పన కూడా నా భర్తతో నీకెంటి పని అని హరితేజతో గొడవ పడటం పర్వాలేదనిపించింది. మంచిగా తెలుగు మాట్లాడే జ్యోతి, మధుప్రియలను బయటకు పంపించి భాష రాని ముమైత్‌తో నరకం చూపిస్తున్నారు. గేమ్ విధానాన్ని మార్చి కొంత జనరంజకంగా మారిస్తే తప్ప బిగ్‌బాస్ దూసుకుపోయే అవకాశం కనిపించడం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -