Saturday, May 11, 2024
- Advertisement -

పిరాయింపు ఎమ్మెల్యేల‌కు షాక్‌… నంద్యాల ప్ర‌చారానికి జ‌గ‌న్‌కు మ‌రో ఆయుధం…

- Advertisement -

నంద్యాల ఉప ఎన్నికలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. టిడిపికి షాకిస్తూ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా పార్టీ కార్యాలయానికి పంపారు. ఇదంతా కూడా వైసీపీ మాస్ట‌ర్‌ప్లాన్ చూస్తె ఒకే దెబ్బ‌కు రెండుపిట్టులన్న‌ట్లుగా ఉంది.
నంద్యాల ఉప ఎన్నికలను వైయస్ జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అది తమ సీటు కాబట్టి అక్కడ ఎలాగైనా గెలవాలని భావిస్తున్నారు. ఈ మేరకు అవసరమైన అస్త్రాలు అన్ని ప్రయోగిస్తున్నారు. టిడిపిలో చేరిన అఖిలప్రియకు షాకిచ్చేందుకు ఆమెను ఒంటరిని చేస్తున్నారు. ఇటీవల నంద్యాలలో ముస్లీం కీలక నేత వైసిపిలో చేరారు. ఇప్పుడు శిల్పా చక్రపాణి రెడ్డి టిడిపికి రాజీనామా చేసి, గురువారం వైసిపిలో చేరనున్నారు.
నంద్యాల ఉప ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి గెలిపించి ఎలాగైనా చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నదని నిరూపించాలని భావిస్తున్నారు. అలాగే, తనను అన్యాయం చేసి టిడిపిలో భూమా కుటుంబానికి గుణపాఠం చెప్పాలని జగన్ భావిస్తున్నారు.
ప్ర‌ధానంగా ప్ర‌చారంలో టీడీపీకి చెక్ పెట్టేందుకు జ‌గ‌న్ ప్లాన్ క‌నిపిస్తోంది. చక్ర‌పాణి రూపంలో మ‌రో ఆయుధాన్ని ప్ర‌యేగిస్తున్నారు వైసీపీ అధినేత‌. టీడీపీ త‌రుపున మంత్రులంద‌రు ప్ర‌చారం చేస్తున్నారు. చక్ర‌పాణి పార్టీకి,ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామ‌చేసి వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. దీన్నె ఆయుధంగా మ‌లుచుకొని వైసీపీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో దూసుకుపోనుంది.
పిరాయించిన ఎమ్మెల్యేలు ఎవ‌రూ త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామ‌చేయ‌కుండా టీడీపీలో చేరి మంత్రుప‌ద‌వులు పొందారు. దీన్ని అస్త్రంగా మ‌లుచుకొని నంద్యాల ఉప ఎన్నిక‌ల ప్ర‌చారంలో మంఉదుకు పోనున్నారు. అటు అఖిల‌ను ఒఒట‌రిని చేయ‌డంతోపాటు… పిరాయింపుల‌ను ఆయుధంగా వైసీపీ ఉప‌యేగించుకోనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -