Thursday, May 16, 2024
- Advertisement -

సూచ‌న‌లు గ‌మ‌నించ‌కుండా డ్రింక్ త్రాగుతే చివ‌రికి ఇలా అవ్వాల్సిందే…

- Advertisement -

కొన్ని రకాల పదార్థాలు తినేటపుడు, తాగేటపుడు ఆయా సంస్థలు వాటిని ఉపయోగించే పద్ధతులను వివరిస్తుంటాయి. అందుకే పదార్థాలను తినడానికి ముందు ఆ సంస్థ చేసిన సూచనలను పాటిస్తె ఇబ్బంది ఉండ‌దు.. ఏమీ చూడకుండా ఆతృతతో పని కానిచ్చేద్దాం అనుకుంటే మాత్రం అసలుకే మోసం వస్తుంది.

ప్ర‌పంచంలోనే ఘాటుగా ఉండే క‌రోలినా రీప‌ర్ మిర‌ప కాయ‌ల‌తో చేసిన వోడ్కాకు ‘దెయ్యాలు తాగే వోడ్కా’ అని పేరు. దీని లేబుల్ మీద `1780 శాతాన్ షాట్, దీన్ని క‌రోలినా రీప‌ర్ మిర‌ప‌కాయ‌ల‌తో చేశారు. తాగేముందు జాగ్ర‌త్త` అని రాసి ఉంటుంది. ఇదేదీ చూసుకోకుండా స్నేహితురాలు పార్టీ ఇచ్చింది క‌దా అని శాతాన్ షాట్‌ను తాగి ఆసుప‌త్రి పాల‌య్యాడు బ్రిట‌న్‌కు చెందిన వ్య‌క్తి.

బ్రిట‌న్‌లోని స‌ర్రే ప్రాంతంలో జ‌రుగుతున్న మిర‌ప కాయ‌ల ఎగ్జిబిష‌న్‌లో ఈ శాతాన్ వోడ్కాను ఎమ్మా మిర్రింగ్ట‌న్ కొనుక్కొచ్చింది. సాయంత్రం త‌న స్నేహితుల‌ను పిలిచి పార్టీ ఏర్పాటు చేసింది. అలా పార్టీకి వ‌చ్చిన ఓ వ్య‌క్తి ఈ వోడ్కాను తాగి ఘాటు భ‌రించలేక అప‌స్మార‌క స్థితికి వెళ్లిపోయాడు. ఆసుప‌త్రికి తీసుకెళ్లి చికిత్స చేసిన త‌ర్వాత కోలుకున్నాడు.

ఈ సంఘ‌ట‌న‌కు ఎమ్మా, మొద‌ట‌ వోడ్కా త‌యారుచేసిన కంపెనీని త‌ప్పుబ‌ట్టింది. వారు త‌మ బాటిల్‌పై ముద్రించిన సూచ‌న‌లు చూపించి, ఇవి చ‌ద‌వ‌కుండా తాగితే అలాగే ఉంటుంద‌ని కొట్టిన‌ట్లు చెప్ప‌డంతో ఎమ్మా తెల్ల‌మొహం వేసింది.

చూశారుగా మద్యం ఘాటుగా ఉంటుందని.. సేవించే ముందు తగు జాగ్రత్తలు తీసుకోవాలని బాటిల్‌పై ఆ సంస్థ చేసిన హెచ్చరికను గమనించకుండా సేవించడంతో సదరు వ్యక్తి ఆస్పత్రి పాలవ్వాల్సి వచ్చింది.

https://www.youtube.com/watch?v=keLhKdo8-I8

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -