Sunday, May 5, 2024
- Advertisement -

మ‌రో వివాదంలో ఇరుకున్న‌ బిత్తిరి స‌త్తి

- Advertisement -

ఏపీలో ప్ర‌చారం జోరుగా సాగుతోంది. అధికార టీడీపీ పార్టీ , ప్ర‌తిప‌క్ష పార్టీ వైసీపీలు రెండు నువ్వా నేనా అన్న‌ట్లు పోటీ ప‌డుతున్నాయి. ఎన్నిక‌ల స‌మ‌యంలో సినిమా ఇండ‌స్ట్రీకి చెందిన వారు కూడా ప‌లు పార్టీల్లో చేరి ఆ పార్టీ త‌రుపున ప్ర‌చారం నిర్వ‌హిస్తుంటారు. ఈ సారి జ‌రిగే ఎన్నిక‌ల్లో టీవీదైన‌ యాక్టింగ్ స్టైల్‌తో బాగా పాపుల‌ర్ అయ్యాడు బిత్తిరి స‌త్తి. స‌త్తి వీడియోల‌కు యూట్యూబ్‌లో మిలియ‌న్ వ్యూస్ వ‌స్తుంటాయి. అయితే ఎన్నిక‌ల స‌మ‌యంలో బిత్తిరి స‌త్తి క్రేజ్‌ను క్యాష్ చేసుకుంద‌మ‌ని భావించింది వైసీపీ పార్టీ.

అత‌ని చేత ఓ పార్టీ పాట‌ను పాడించారు. ఇప్పుడు ఈ పాట వివాదంగా మారింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే. బిత్తిరి స‌త్తి చేత పార్టీపాట పాడిస్తే ఆ పాట తొంద‌ర‌గా జ‌న్నాల్లోకి వెళ్తుంద‌ని భావించింది వైసీపీ అధిష్టానం. అనుకున్న తరువాయే స‌త్తి చేత పాట‌ను పాడించ‌డం జ‌రిగింది. అయితే బిత్తిరి స‌త్తి ఓ రాజ‌కీయ పార్టీకి అనుకులంగా పాట‌ను పాడ‌టం ఏంట‌ని చాలామంది ఆయ‌న్ను ప్ర‌శ్నిస్తున్నారు.ఈ పాట తెలంగాణ యాసలో ఉంద‌ని కొంద‌రు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు.

ఇది కాస్తా వివాదంగానే మారిన‌ప్ప‌టికి ,బిత్తిరి స‌త్తి పాడిన పాట‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. ఎన్నిక‌ల స‌మ‌యంలో స‌త్తి పాడిన ఈ పాట బాగానే పాపుల‌ర్ అవుతోంది. స‌త్తి పాడిన పాటను వైసీపీ త‌న ప్ర‌చారంలో బాగా వాడుకుంటుంది. సోష‌ల్ మీడియాలో కూడా ఈ పాట బాగా వైర‌ల్ అవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -