Tuesday, May 14, 2024
- Advertisement -

కౌశ‌ల్ కుతురు పుట్టిన రోజున ర‌క్త దానాలు చేసిన కౌశ‌ల్ ఆర్మీ

- Advertisement -

బిగ్‌బాస్ రెండో సీజ‌న్ ద్వారా లైఫ్ లైన్‌లోకి వ‌చ్చాడు కౌశ‌ల్. అంత‌క‌ముందు ఓ సాధార‌ణ న‌టుడిగా ఉన్న కౌశ‌ల్ బిగ్‌బాస్ ద్వారా బాగా పాపుల‌ర్ అయ్యాడు.కౌశ‌ల్ బిగ్‌బాస్ హౌస్‌లో ఒంట‌రి వాడు కావచ్చు కాని బ‌య‌ట మాత్రం కౌశ‌ల్ గేమ్ ఆడుతున్న విధానానికి బ‌య‌ట అత‌నికి చాలామంది అభిమానులు ఏర్ప‌డ్డారు.కౌశ‌ల్ ఆర్మీ పేరిట అతనికి మ‌ద్ద‌తు తెలుపుతున్నారు.కౌశ‌ల్‌కు స‌పోర్టుగా హైదరాబాద్‌,విజ‌య‌వాడ‌ల‌లో భారీ ర్యాలీలు నిర్వ‌హించారు కౌశ‌ల్ అభిమానులు. కౌశ‌ల్ ఆర్మీ తాజాగా చేసిన పనితో మ‌ళ్లీ వార్త‌ల్లో నిలిచారు.

నిన్న‌(గుర‌వారం) కౌశ‌ల్ కుతురు పుట్టిన రోజు కావ‌డంలో కౌశ‌ల్ ఆర్మీ ఆ పుట్టిన రోజుని ఘ‌నంగా జ‌రుపుకున్నారు.కౌశ‌ల్ అన్న మీరు లేక‌పోయిన మీ పాప పుట్టిన రోజు మేము ఘ‌నంగానే జ‌రిపాం అని సోష‌ల్ మీడియాలో పోస్ట్‌లు చేశారు ఆయ‌న అభిమానులు. కౌశ‌ల్ కుతురు కోసం ర‌క్త దానాలు కూడా నిర్వ‌హించారు కౌశ‌ల్ ఆర్మీ. బిగ్‌బాస్ రెండో సీజ‌న్ ఫైన‌ల్‌ ద‌గ్గ‌ర ప‌డ‌టంలో ఆయ‌న‌పై కుట్ర జ‌రుగుతుంద‌ని కౌశ‌ల్ అభిమానులు భావిస్తున్నారు.కౌశ‌ల్ బిగ్‌బాస్ టైటిల్‌తోనే బ‌య‌టికి వ‌స్తాడ‌ని ధీమా వ్య‌క్తం చేస్తున్నారు కౌశ‌ల్ ఆర్మీ.కౌశ‌ల్ కుతురు పుట్టిన రోజు సంద‌ర్భంగా నూత‌న్ నాయుడు కౌశ‌ల్ ఇంటికి వెళ్లి మ‌రి ఆ పాప‌ను ఆశీర్వదించిన సంగ‌తి తెలిసిందే.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -