Sunday, May 5, 2024
- Advertisement -

బాలీవుడ్‌లోకి కోహ్లీ….ట్విట్ట‌ర్‌లో ఫ‌స్ట్‌లుక్ అదుర్స్‌

- Advertisement -

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ బాలీవుడ్ సినిమాలో నటించాడా? అంటే అతడు తాజాగా చేసిన ట్వీట్ అవుననే సమాధానికి తావిస్తోంది. ఏదో మూవీ పోస్టర్‌లాగా ఉన్న ఆ ఫొటోలో కోహ్లి ఓ సూపర్ హీరోలా కనిపిస్తున్నాడు. ఇప్పుడీ ఫొటోనే ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారిపోయింది.

ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్‌ టోర్నమెంట్‌కు దూరమైన విరాట్ కోహ్లీ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అంతేకాక కోహ్లి తన షేర్‌ చేసిన ఫోటోతో పాటు ‘పదేళ్ల తర్వాత మరో అరంగేట్రం చేస్తున్నాను.. వెయిట్ చేయలేకపోతున్నాను ’అంటూ కామెంట్‌ చేశారు. ప్రశ్నలన్నింటికి సమాధానాలు తెలియాలంటే ఈ నెల 28 వరకూ ఆగాల్సిందే.

ఇదే రోజు ఆయన సతీమణి అనుష్క శర్మ నటించిన ‘సూయి ధాగా’ చిత్రం విడుదలవుతోంది. దాంతో ఇప్పుడు అందరిలో ఒకే అనుమానం.. కోహ్లి సినిమాల్లోకి వస్తున్నారా.. హీరోగానా లేకా తన భార్య అనుష్క చిత్రంలో ఏదైనా గెస్ట్‌ రోల్‌లో నటిస్తున్నారా.. అది కాక ఏదైనా షార్ట్‌ ఫిలింలో నటిస్తున్నారా అంటూ తెగ ఆలోచిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -