Friday, April 19, 2024
- Advertisement -

తండ్రిని రౌడీల‌తో కొట్టించిన న‌టి

- Advertisement -

సీనియర్ నటుడు విజయ్ కుమార్ త‌న కుతురు వనితపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.షూటింగ్‌ కోసం ఇంటిని అద్దెకు తీసుకుని, ఖాళీ చేయకుండా ఆక్రమించుకుందని సీనియర్‌ నటుడు విజయకుమార్‌ తన కూతురు వనితపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో బుధవారం రాత్రి ఫిర్యాదు చేశారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే…మధురవాయిల్, అలపాక్కమ్‌లోని అష్టలక్ష్మి నగర్‌ 11వ వీధిలో విజయ్ కుమార్‌కు ఓ ఇల్లు ఉంది.దాన్ని షూటింగ్‌లకు అద్దెకు ఇస్తూ, తాను తన కొడుకు అరుణ్‌తో కలిసి కొట్టివాక్కమ్‌లో నివశిస్తున్నారు విజ‌య్ కుమార్‌.

తన కూతురు వ‌నిత షూటింగ్ నిమిత్తం వారం రోజులెకి అద్దెకి తీసుకుని ,ఖాళీ చేయ‌కుండా ఆ ఇంటిని ఆక్ర‌మించుకుంద‌ని విజ‌య్ కుమార్ తెలిపారు.ఇదేమిటి అని అడ‌గ‌టానికి వెళ్తే రౌడీల‌తో బెదిరిస్తుంద‌ని విజ‌య్ కుమార్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.అయితే వనిత వాద‌న మ‌రోలా ఉంది.ఆ ఇంటిలో నాకు వాటా ఉంద‌ని చెబుతుంది విజ‌య్ కుమార్ కుతురు వ‌నిత‌.అందువల్లే తాను ఖాళీ చేయనని పోలీసులతో వాగ్వాదానికి దిగింది. దీంతో పోలీసులు ఇల్లు మీదనడానికి ఆధారాలుంటే చూపాలని చెప్పారు. విషయం గురించి తెలియడంతో మీడియా వాళ్లు అక్కడికి చేర‌డంతో, వనిత మీడియా వాళ్లపై తిరగబడింది. కొందరు ఫొటోగ్రాఫర్ల కెమెరాలను లాగి నేలకేసి కొట్టింది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -