Wednesday, May 22, 2024
- Advertisement -

మెగాస్టార్‌తో మ‌రోసారి ట‌బూ?

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్ర‌తీష్టాత్మ‌కంగా తీసుకుని న‌టిస్తున్న సినిమా సైరా.స్వాతంత్రద్యోమ‌కారుడు అయిన ఊయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత క‌థ‌ను సైరా సినిమాగా తెర‌కెక్కిస్తున్నారు. చిరంజీవి పుట్టిన రోజు సంద‌ర్భంగా విడుద‌ల చేసిన టీజ‌ర్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది.చారిత్రక నేపథ్యంలో నిర్మితమవుతోన్న ఈ సినిమాలో అమితాబ్, నయనతార,సుదీప్ ,విజయ్ సేతుపతి ,త‌మ‌న్నా ,జ‌గ‌ప‌తిబాబులు కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు.

తాజాగా ఈ సినిమాలో ‘టబూ’ కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషించనున్నట్టుగా ఒక వార్త వినిపిస్తోంది. టబూ ఓకే అంటే త్వరలోనే ఆమె ఈ సినిమా షూటింగులో పాల్గొనే అవకాశం ఉందని చెబుతున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా చిరంజీవి త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ త‌న నిర్మాణ సంస్థ‌లో నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -