Monday, April 29, 2024
- Advertisement -

గణేశ్ తో పాటు నూతన్ నాయుడు ఎలిమినేట్

- Advertisement -

ఏదైనా జరగొచ్చు. ఎందుకంటే ఇది బిగ్ బాస్…అని చెప్పుకొచ్చినట్లు ఈ వారం డబుల్ ఎలిమినేషన్ లో నిజంగానే షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. గతంలో వచ్చిన లీకులు అన్నీ నిజమైనట్టే…12వ వారం ఎలిమినేషన్ పై వచ్చిన లీకు కూడా నిజమేనని తెలుస్తోంది. ఈ వారం కౌషల్, నూతన్ నాయుడు, సామ్రాట్, అమిత్ తివారి, గణేశ్ నామినేట్ అయ్యారు. ఆఖరి స్థానంలో నిలిచిన గణేశ్ శనివారమే ఎలిమినేట్ అయిపోయాడు. ఇక మిగిలిన నలుగురులో కౌషల్ కోట్ల ఓట్లతో ఒకటో ప్లేసులో సేఫ్ గా నిలిచాడు. రెండో స్థానంలో నూతన్ నాయుడు, మూడో ప్లేసులో సామ్రాట్, నాలుగో స్థానంలో అమిత్ మిగిలారు. ప్రేక్షకులు వేసిన ఓట్లు, వివిధ ఆన్ లైన్ సర్వేలు చెప్పిన ఓట్ల లెక్క ఇది. దీని ప్రకారమైతే కచ్చితంగా డబుల్ నామినేషన్ లో అమిత్ తివారి ఎలిమినేట్ కావాల్సిందే. కానీ అలా జరగలేదని శనివారం నుంచీ ఒకటే లీకులు వస్తున్నాయి. అమిత్ తివారి సేవ్ అయ్యాడని, నూతన్ నాయుడు ఎలిమినేట్ అయిపోయాడని తెలుస్తోంది.

తేజశ్వి ఎలిమినేట్ అయిపోయిన విషయాన్ని ముందుగా ఫొటోతో సహా తెలియజేసిన ఆమె ఫ్రెండ్ ఇంటూరి ఇప్పుడు కూడా నూతన్ ఎలిమినేషన్ పై లీక్ ఇచ్చింది. గతంలో శ్యామల, దీప్తి నల్లమోతు, నందిని నామినేట్ అయ్యారు. అప్పుడు కౌషల్, తేజశ్వికి స్పెషల్ పవర్ ఇచ్చిన బిగ్ బాస్ ఆ ముగ్గురిలో ఒకరిని ఎలిమినేట్ చేసి, మిగిలిన ఇద్దరిని సేవ్ చేసుకోవచ్చని చెప్పాడు. నాడు తేజశ్వి దీప్తి నల్లమోతుని, కౌషల్ నందినిని సేవ్ చేశారు. దాంతో శ్యామల ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడు కూడా అదే విధంగా సామ్రాట్, నూతన్, అమిత్ తివారి ముగ్గురిలో ఒకరిని ఎలిమినేట్ చేసి, మిగిలిన ఇద్దరిని సేవ్ చేసుకోవాలని ఇంటి సభ్యులకే బిగ్ బాస్ అవకాశమిచ్చినట్లు సమాచారం. దీంతో రోల్ రైడా, తనీష్, దీప్తి నల్లమోతు, గీతామాధురి, శ్యామల, ఏకమై సామ్రాట్, అమిత్ ను సేవ్ చేశారు. సైకిల్ టాస్క్ తో పాటు, ప్రతిసారి నూతన్ నాయుడుని వ్యతిరేకిస్తున్న ఈ గ్యాంగ్ ఈ సారి కూడా నూతన్ నాయుడునే టార్గెట్ చేశారు. దీంతో కౌషల్ అతడిని సేవ్ చేయాలని ప్రయత్నించినా కుదరలేదని తెలుస్తోంది. ఇక ఇంటిసభ్యుల ఓట్లుతో అమిత్, సామ్రాట్ సేవ్ కాగా, నూతన్ ఎలిమినేట్ అయ్యాడన్నది లేటెస్ట్ బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన బిగ్ లీక్.

అయితే ఈ లీక్ నూటుకి నూరు శాతం నిజమయ్యే చాన్స్ ఉంది. గతంలోనూ ఇలాంటి లీక్ న్యూస్ పక్కా గా నిజమైంది. ఇప్పుడు కూడా అదే నిజమైతే బిగ్ బాస్ రూల్స్ పై బీభత్సమైన ట్రోల్స్ నడవడం ఖాయం. ప్రజల ఓట్లుతో సంబంధం లేనప్పుడు, ఇంటిసభ్యులే నిర్ణేతలైనప్పుడు ఈ ఓటింగ్ ఎందుకని ఇప్పటికే నిలదీస్తున్నారు. అయితే గతంలో కూడా ఇలాగే చేశాం కదా…అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు. అని బిగ్ బాస్, నాని సమర్ధించుకోవడం కూడా ఖాయం. ఎందుకంటే అది బిగ్ బాస్, ఏదైనా జరగొచ్చు, ఏ రూల్స్ ఎవరైనా బ్రేక్ చేయవచ్చు. శ్యామల బయటి విషయాలు లోపల చెప్పి రూల్స్ బ్రేక్ చేసినట్లు…అయినా ఆమెపై చర్యలు తీసుకోనట్టు…

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -