Wednesday, May 8, 2024
- Advertisement -

ఏపీ బీజేపీ అధ్యక్ష బరిలోకి అనూహ్యంగా కొత్త పేరు..

- Advertisement -

ఏపీలో భాజాపా సొంత‌గా ఎదిగేందుకు ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేసింది. వెంక‌య్య‌నాయుడు చంద్ర‌బాబుకు అనుకూలంగా ఉండ‌టం వ‌ల్ల పార్టీ విస్త‌రించ‌లేద‌న్న కార‌ణాల‌తో ఆయ‌న‌ను ఉప‌రాష్ట్ర‌ప‌తిగా పంపిన త‌ర్వాత మ‌రింత దూకుండు పెంద‌చింది. ప్ర‌త్యేక‌హోదా, విభ‌జ‌న హామీల‌ను అమ‌లు చేయ‌క‌పోవ‌డంతో టీడీపీ ఎన్డీఏనుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

చంద్ర‌బాబుకు చెక్ పెట్టేందుకు అధిస్టానం పావులు క‌దుపుతోంది. రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌గా రామ్ మాధ‌వ్ బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇంత‌కు ముందు భాజాపా అధ్య‌క్షుడిగా ఉన్న హ‌రిబాబు చంద్ర‌బాబుకు అనుకూలంగా ఉండ‌టంతో ఆయ‌న‌ను అధ‌క్ష‌ప‌ద‌వినుంచి త‌ప్పించారు. ఆయ‌న స్థానంలో సోము వీర్రాజుపేరే కూడా దాదాపు ఖ‌రారు అయ్యింద‌నే వ‌ర్త‌లు హ‌ల్ చ‌ల్ చేశాయి. అయితే ఇప్పుడు అనూహ్యంగా అధ్య‌క్ష‌రేసులో ద‌గ్గుపాటి పురందేశ్వ‌రి పేరు వ‌చ్చి చేరింది.

గ‌తంలో కూడా తనకు రాష్ట్ర రాజకీయాలకన్నా, జాతీయ రాజకీయాలపైనే ఆసక్తి ఎక్కువగా ఉంటుందని ఎప్పుడూ చెప్పే పురందేశ్వరిని, ఈ పదవికి ఎంపిక చేస్తే బాగుంటుందని పలువురు ఏపీ బీజేపీ నేతలు అధిష్ఠానానికి విన్నవించినట్టు తెలుస్తోంది. సోము వీర్రాజుకు అధ్య‌క్ష ప‌ద‌వి ఇస్తే పార్టీ రెండుగా చీలుతుంద‌ని ఆకుల సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేయ‌డంతో అధిష్టానం ఆలోచ‌న‌లో ప‌డింది.

ముందుగా మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుకు అధ్య‌ప‌ద‌వి అవ‌కాశం వ‌చ్చింది. అయితే ఆయ‌న దాన్ని సున్నితంగా తిర‌స్క‌రించిన మాణిక్యాల్‌రావు మాత్రం సోము వీర్రాజుకు స‌పోర్ట్ చేస్తున్నారు. సోము వీర్ర‌జా విష‌యంలో భిన్నాభిప్రాయాలు ఉండ‌టంతో అంద‌రికీ ఆమోద యోగ్యంగా ఉండే పురందేశ్వ‌రి పేరు తెర‌పైకి వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. మ‌రి అధ్య‌క్ష‌ప‌ద‌వి ఎవ‌రిని వ‌రిస్తాదో తెలుసుకోవాలంటే రెండు రోజులు ఆగాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -