Monday, April 29, 2024
- Advertisement -

హీరోయిన్ వక్షోజాలపై వ‌ల్గ‌ర్ కామెంట్స్ చేసిన న‌టుడు

- Advertisement -

ఇటీవ‌ల కాలంలో స్టాండప్ కామెడీ పేరిట చేస్తున్న హ‌స్యంలో వ‌ల్గ‌రిటీ కాస్తా ఎక్కువ అయింద‌నే చెప్పాలి. సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబును యాక్టింగ్ రాదంటూ ఓ క‌మెడియ‌న్ చేసిన వ్యాఖ్య‌లు పెద్ద దుమారం రేపాయి. ఈ వ్యాఖ్య‌ల‌పై మ‌హేశ్ బాబు అభిమానులు ఫైర్ అయ్యారు. తాజాగా ఇటువంటి సంఘ‌ట‌నే మ‌రోక‌టి జ‌రిగింది. బాలీవుడ్ ప్ర‌ముఖ క‌మెడియ‌న్ వ‌రుణ్ గ్రోవ‌ర్ హీరోయిన్ అయేషా టాకియా వక్షోజాల గురించి వ‌ల్గర్ కామెంట్స్ చేశాడు. ఓ విష‌యం గురించి ఉదాహరణగా ”అవి ఎలా బయటకి వస్తున్నాయంటే అయేషా టాకియా వక్షోజాల మాదిరిగా” అంటూ నోరు జారారు. దీనిపై అక్క‌డ ఉన్నవారు న‌వ్వారు , త‌ప్ప ఎవ‌రు ఎలాంటి అభ్యంత‌రం తెల‌ప‌క‌పోవ‌డం విశేషం.

తాను అయేషా టాకియా ఎద భాగానికి ఆకర్షితుడై అయ్యాన‌ని చెప్పుకొచ్చాడు వరుణ్ గ్రోవర్. తాజాగా దీనికి సంబంధించిన వీడియోను బాలీవుడ్ దర్శకుడు అశోక్ పండిట్ షేర్ చేయడంతో ఈ విష‌యం బ‌య‌ట‌ప‌డింది. ఆడవాళ్లంటే గౌరవం లేకుండా మాట్లాడడం సిగ్గుచేటని కామెంట్స్ చేస్తున్నారు నెటిజ‌న్లు. అయితే ఈ వీడియో ఇప్ప‌టిది కాద‌ని , చాలా సంవ‌త్స‌రాల క్రితం వీడియోను ద‌ర్శ‌కుడు ఇప్పుడు షేర్ చేశాడ‌ని మ‌రి కొంద‌రు అంటున్నారు. ఇక అయేషా టాకియా తెలుగులో కూడా న‌టించింది. నాగ‌ర్జున న‌టించిన సూప‌ర్ సినిమాలో హీరోయిన్‌గా న‌టించింది. ఈ సినిమా తరువాత మ‌ళ్లీ తెలుగులో క‌నిపించ‌లేదు అయేషా .

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -