Saturday, April 27, 2024
- Advertisement -

చైన్నై సూప‌ర్ కింగ్స్‌పై ముంబై ఇండియ‌న్స్ విజ‌యం సాధించేనా…?

- Advertisement -

ఐపీఎల్ తాజా సీజ‌న్‌లో అన్ని జ‌ట్లు హోరహోరి పోరాడుతున్నాయి. శుక్ర‌వారం చైన్నై జ‌ట్టుతో త‌ల‌ప‌డ‌నుంది ముంబై ఇండియ‌న్స్. ఈ ఐపీఎల్లో అన్ని జ‌ట్ల కంటే ముందే ప్లే ఆఫ్‌కు చేరుకుంది చైన్నై సూప‌ర్ కింగ్స్‌. ధోని సార‌థ్యం వ‌హిస్తున్న చైన్నై జ‌ట్టు వ‌రుస విజ‌యాలు సాధిస్తు 16 పాయింట్లతో పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర స్థానంలో కొన‌సాగుతోంది. ఇక ముంబై ఇండియ‌న్స్ టోర్ని మొద‌ట్లో పెద్దగా విజ‌యాలు సాధించ‌లేదు. త‌రువాత వ‌రుస విజ‌యాలు సాధిస్తు 12 పాయింట్ల‌తో ప‌ట్టిక‌లో మూడో స్థానంలో కొన‌సాగుతోంది. ఈ రెండు జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన గ‌త మ్యాచ్‌లో చైన్నై జ‌ట్టుపై ముంబై ఇండియ‌న్స్ ఘ‌న విజ‌యం సాధించింది.

ఈ రోజు జ‌ర‌గ‌నున్న మ్యాచ్‌లో విజ‌యం సాధించి లెక్క స‌రిచేయ‌ల‌ని చూస్తుంది చైన్నై సూప‌ర్ కింగ్స్‌. దీంతో ఇరు జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ మంచి ర‌స‌వ‌త్త‌రంగా జ‌ర‌గ‌నుందన‌డంలో ఎటువంటి అనుమానం లేదు. ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు చెప్పుకొద‌గ్గ ఇన్నింగ్స్ రాలేదు. పాండ్య బ్ర‌ద‌ర్స్ జ‌ట్టు విజ‌యాల్లో కీల‌క పాత్ర వ‌హిస్తున్నారు. ఇక చైన్నై సూప‌ర్ కింగ్స్‌లో వాట్స‌న్ స‌న్‌రైజ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌తో ట‌చ్‌లోకి వ‌చ్చాడు. కేదార్ జాద‌వ్‌, రైనా, ధోని వంటి బ్యాట్స్‌మెన్‌తో ఆ జ‌ట్టు బ‌లంగా క‌నిపిస్తోంది. మ‌రి ఈ రోజు జ‌ర‌గ‌నున్న మ్యాచ్‌లో ఎవ‌రు విజ‌యం సాధిస్తారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -