Monday, May 6, 2024
- Advertisement -

బాలీవుడ్ హీరోయిన్‌ను ప‌ట్టిన వెంకీ?

- Advertisement -

విక్ట‌రీ వెంక‌టేష్ సినిమాల‌లో క‌నిపించి చాలా కాలం అయింది.గురు సినిమా త‌రువాత ఇంత వ‌ర‌కు మ‌రో సినిమా తీయ‌లేదు.ఈ మధ్య నాగ‌చైత‌న్య ప్రేమ‌మ్ సినిమాలో అతిధి పాత్ర‌లో క‌నిపించాడు.లాంగ్ గ్యాప్ త‌రువాత వ‌రుస పెట్టి సినిమాలు అంగీక‌రిస్తున్నాడు.

ఇప్పటికే అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్‌ 2 (ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌) సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నారు వెంకీ. ఈ సినిమాలో యంగ్‌ హీరో వరుణ్‌ తేజ్‌తో కలిసి నటించనున్నారు.ఈ సినిమా ఈ సినిమాతో మరో క్రేజీ మల్టీస్టారర్‌కు ఓకె చెప్పారు వెంకీ.తన మేనల్లుడు నాగచైతన్యతో కలిసి బాబీ దర్శకత్వంలో మ‌రో సినిమా చేస్తున్నాడు వెంకీ.

ఈ సినిమాలో వెంకీకి జోడిగా బాలీవుడ్ బ్యూటీ నటించనుందన్న ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ హీరోయిన్ హుమా ఖురేషీ, వెంకీకి జోడిగా నటించనున్నారన్న ప్రచారం జరుగుతోంది.ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -