Thursday, April 25, 2024
- Advertisement -

భారత పౌరసత్వమే లేని బాలీవుడ్ తార‌లు

- Advertisement -

బాలీవుడ్ తార‌లు గురించి మ‌నం ఎప్పుడు వాళ్ల రిలేషన్‌షిప్స్, బ్రేక్‌అప్స్ గురించి త‌ప్ప మిగిలిన వాటి గురుంచి పెద్ద‌గా పట్టించుకొం. అయితే ఇప్ప‌డు బాలీవుడ్‌లో స్టార్స్‌గా హోదా అనుభ‌విస్తున్న హీరో హీరోయిన్స్‌కు భార‌తీయ పౌర‌సత్వం లేద‌నే విషయం మ‌న‌లో చాలా మందికి తెలియ‌దు. కొంత మంది అయితే ఏకంగా మన పౌరసత్వాన్ని రద్దు చేసుకొని మరో దేశం పౌరసత్వం స్వీకరించారు.

దీపికా పదుకొనె: దీపికా పదుకొనె బాలీవుడ్ నం-1 హీరోయిన్‌గా ఉన్న ఈమెకు మ‌న దేశ‌పు పౌర‌స‌త్వం లేద‌నే విష‌యం ఎవ్వ‌రికి తెలియ‌దు.మాజీ బ్యాట్మెంటన్ క్రీడాకారుడు ప్రకాష్ పదుకొనె కూతురు అయిన దీపికా పదుకొనె పుట్టింది డెన్మార్క్ రాజధాని కోపెన్‌హెగెన్‌లో… అప్పట్లో ప్రకాష్ పదుకొనే బ్యాట్మెంటన్ శిక్షణ కోసం డెన్మార్క్‌కు మకాం మార్చారు. దీపిక పుట్టింది అక్కడే. దీపికకు డెన్మార్క్ పౌరసత్వం ఉంది. ఇక్కడ ఓటేసే హక్కు ఆవిడకు లేదు.

ఆలియాభట్: ఆలియాభట్ ఈ కుర్ర హీరోయిన్ త‌న అందాల‌తో యూత్‌కు నిద్ర లేకుండా చేస్తున్న ఈ భామ‌కు ఇండియాలో పౌర‌స‌త్వం లేదు.ప్రముఖ దర్శకుడు, సినీ నిర్మాణ మహేష్ భట్ రెండో భార్య ‘సోని రాజ్దాన్’ కూతురే ఆలియాభట్. తల్లికి బ్రిటీష్ పౌరసత్వం ఉండడంతో ఆలియాకు కూడా బ్రిటీష్ పౌరసత్వం వచ్చింది. ఈమె పుట్టి, పెరిగింది లండన్‌లో ఇప్పటికీ బ్రిటీష్ పౌరసత్వం వదులుకోలేక భారతీయ పౌరసత్వానికి అప్లై చేసుకోలేదు.

క‌త్రిన కైఫ్: క‌త్రినా కైఫ్ బాలీవుడ్‌లో మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ఎవ్వ‌రు అంటే ఠ‌క్కున అంద‌రు క‌త్రినా కైఫ్ పేరే చెబుతారు. క‌త్రినా కైఫ్ పుట్టింది హాంగ్‌కాంగ్‌లో. తండ్రి కశ్మీరీ, తల్లి బ్రిటన్ దేశస్తురాలు. ఈమెకు బ్రిటీష్ పౌరసత్వం ఉంది. భారత పౌరసత్వం తీసుకోలేదు. మోడలింగ్‌లో కెరీర్ ప్రారంభించి ఆతర్వాత వెండితెరకు పరిచయం అయింది. ముంబైకి మకాం మార్చక ముందు లండన్ లో చాలా ఏళ్లు జీవించింది.

అక్షయ్ కుమార్: అక్షయ్ కుమార్ బాలీవుడ్‌లో ఖాన్ త్ర‌యానికి పోటి ఎవ్వ‌రైనా ఉన్నారు అంటే అది అక్షయ్ కుమారే.పలు సందేశాత్మక సినిమాల్లో నటించి అందర్ని మెప్పించిన అక్షయ్ కుమార్ ఇండియా పౌర‌స‌త్వ‌న్ని వ‌దులుకొని కెనెడా పౌరసత్వాన్ని స్వీకరించాడు.అక్షయ్ కుమార్ భారతీయ పౌరసత్వాన్ని వదులుకోడానికి చెప్పిన కారణాలు చాలా విడ్డూరంగా ఉన్నాయి. కెనడా ప్రకృతి అందాలు తన మనసు దోచుకున్నాయని అందుకే అక్కడి పౌరసత్వం తీసుకున్నానని చెప్పాడు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -