Wednesday, May 8, 2024
- Advertisement -

ప్ర‌జాశ్రేయ‌స్సే ల‌క్ష్యంగా జ‌గ‌న్ పాద‌యాత్ర‌…

- Advertisement -

ఏడుగురి సందింటి జ‌గ‌న్‌ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జాసంక‌ల్ప‌ పాద‌యాత్ర దిగ్విజ‌యంగా వంద‌రోజులు పూర్తి చేసుకొని విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. పాద‌యాత్రకు ప్ర‌జ‌లనుంచి అనూహ్య‌రీతిలో ప్ర‌జాస్పంద‌న వెల్లువెత్తుతోంది. క‌డ‌ప జిల్లా ఇడుపుల‌పాయ‌లో న‌వంబ‌ర్ 6న జ‌గ‌న్ పాద‌యాత్ర ప్రారంభించారు.

పాద‌యాత్ర‌లో జ‌గ‌న్‌కు అడుగ‌డుగునా ప్ర‌జ‌ల‌నుంచి నీరాజ‌నాలు అందుకుంటూ ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మై సాగుతున్నారు. ప్ర‌జ‌ల క‌ష్ట‌న‌ష్టాల‌ను ఓపిగ్గా వింటూ వారికి భ‌రోసా క‌ల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. మా స‌మ‌స్య‌ల‌ను తీర్చ‌డానికి అన్నా వ‌స్తున్నాడంటూ ప్ర‌జలు చూపించే ప్రేమానురాగాల‌తో ముగ్ధుడై మీకు అండ‌గా నేనున్నానంటూ మ‌రింత ఉత్సాహంతో యాత్ర సాగిస్తున్నారు. వంద‌రోజుల పాద‌యాత్ర‌లో మైలు రాళ్లుఎన్నో.

ఇడుపుల‌పాయ‌లో ప్రారంభ‌మైన పాద‌యాత్ర ఇచ్ఛాపురంలో ముగియ‌నుంది. పాద‌యాత్ర దాదాపు 3000వేల కిలోమీట‌ర్లు. తన వంద రోజుల ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఇప్పటివరకు అటుఇటుగా 1350కిలోమీటర్లు నడిచారు జగన్. ఏకంగా 6జిల్లాల్లో తిరిగి, 43నియోజకవర్గాల్ని కవర్ చేశారు. 99రోజుల కాలినడకలో 39బహిరంగ సభల్లో ప్రసంగించారు. ఈరోజు ప్రకాశం జిల్లా ఉప్పలపాడులో జగన్ ప్రసంగించబోయేది 40వ బహిరంగ సభ.

పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ చంద్ర‌బాబు ప్ర‌భుత్వం చేస్తున్న ప్ర‌జావ్య‌తిరేఖ పాల‌న‌ను వివ‌రిస్తూ…త‌మ పార్టీ అధికారంలోకి వ‌స్తే ప్ర‌జ‌ల‌కు ఏంచేస్తామో వివ‌రిస్తూ ముందుకు సాగుతున్నారు. ప్ర‌ధానంగా న‌వ‌ర‌త్నాల ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెల్తున్నారు. బాబు అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు ఇచ్చిన హామీల‌ను ఎంత వ‌ర‌కు నెర‌వేర్చ‌కుండా ప్ర‌జ‌ల‌ను ఎలా మోసం చేస్తున్నారో వివ‌రిస్తున్నారు.

పాద‌యాత్ర‌లోనే వ‌చ్చే ఎన్నిక‌లక‌ల్లా పార్టీని సిద్ధం చేస్తున్నారు. ప్ర‌ధానంగా గ్రామీణ ప్రాంతాల‌పైనే ప్ర‌ధానంగా దృష్టిపెట్టారు. ఎన్నిక‌లస‌మ‌యం నాటికి పార్టీని ప‌టిష్టం చేస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గాల్లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో నిల‌బ‌డే అభ్య‌ర్తుల‌కు ప్ర‌జ‌ల్లో మైలేజీ ఎలా ఉంది….? గెలుపోట‌ములుల‌పై బేరీజు వేస్తూ ముందుకు సాగుతున్నారు. కొన్ని నియోజ‌బ‌క వ‌ర్గాల్లో ఏకంగా అభ్య‌ర్తుల‌ను ప్ర‌క‌టించి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు.

పాద‌యాత్ర‌కు ప్ర‌తీ శుక్ర‌వారం బ్రేక్ ప‌డుతున్నా ఓపిక‌తో ముందుకు సాగుతున్నారు. పాద‌యాత్ర‌లో కాళ్ళు పుండ్లు అవుతాన్నాఅతి భయంకరమైన మొండిపట్టుదలతో ఈ పాదయాత్రను సాగిస్తున్నారు. అధికారం మీద ఆశలేకుండా ప్ర‌జ‌లే ప్రానంగా సాగుతున్నారు. ఆరోగ్యం బాగాలేక‌పోయినా, కాళ్లకు బ్యాండేజీలు క‌ట్టుకొని ప్ర‌జ‌ల‌కోసం అకుంటిత దీక్ష‌తో పాద‌యాత్ర సాగిస్తున్నారు. ప్ర‌జ‌ల‌కు ఓ భరోసా ఇస్తూ, ఎవరు ఎన్ని భాష్యాలు అయినా చెప్పినా… కేవలం వారికి ఆ భరోసా కల్పించడానికే జగన్ ఇంత శ్రమ తీసుకుంటున్నాడనేది నిజం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -