ప్రపంచం మొత్తం కాస్టింగ్ కౌచ్ ఉంది అంటున్నారు బాలీవుడ్ హీరోయిన్ రాధికా ఆప్టే .తాజాగా టాలీవుడ్లో నటి శ్రీరెడ్డి తెలుగు సినిమాలలో అవకాశాల కొసం పడుకొవలని పడుకుంటేనే ఇక్కడ అవకాశాలు ఇస్తారని చెప్పి సంచలన ఆరోపణలు చేసింది.దీనిపై స్పందించిన రాధికా ఆప్టే ఒక్క సినిమా ఇండస్ట్రీలోనే కాదు ప్రపంచంలో ఎక్కడైన లైంగిక వేధింపులు తప్పడం లేదని చెప్పుకొచ్చింది. తనకు కెరీర్ మొదట్లో అనుభవాన్ని చెప్పకొచ్చింది.
ఓ సినిమా చేయాలని నాకు ఫోన్ చేశారు. ఆపై వారితో నేను సమావేశం అయ్యాను. ఓ వ్యక్తి పేరు చెప్పి, అతనితో ఓ రాత్రి గడపడానికి ఓకేనా? అని అడిగారు. నేను నవ్వాను. తమాషా చేస్తున్నారా? అని అడిగాను. కుదరదని చెప్పాను. గో టూ హెల్ అంటూ వచ్చేశాను” అని చెప్పింది.ఇక బాలీవుడ్ కాస్టింగ్ కౌచ్ పై రాధికా ఆప్టే పలుమార్లు స్పందించిన సంగతి తెలిసిందే.
