Wednesday, May 8, 2024
- Advertisement -

ఆస్ట్రేలియాలో భార‌త్ ప‌ర్య‌ట‌న‌ షెడ్యూల్‌ను విడుద‌ల చేసిన బీసీసీఐ ….

- Advertisement -

ఐపీఎల్ అనంతరం టీమ్ ఇండియా బిజీబిజీగా గడపనుంది. ఇప్పటికే ఇంగ్లండ్‌తో వన్డే, టీ20, టెస్టు సిరీస్‌లు ఖరారయ్యాయి. జులైలో కోహ్లీ సేన ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. అయితే ఈ ఏడాదిలోనే భారత్.. ఆస్ట్రేలియాతోనూ తలపడనుంది. ఈ ఏడాది నవంబర్‌లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న టీమిండియా.. మూడు టీ20లు, నాలుగు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ మేరకు క్రికెట్‌ ఆస్ట్రేలియా 2018-19కి సంబంధించి ఆసీస్‌ షెడ్యూల్‌ను ప్రకటించింది.

2018 నవంబరు 21 నుంచి 2019 జనవరి 18 వరకు భారత్‌-ఆస్ట్రేలియా మధ్య టీ20, టెస్టు, వన్డే సిరీస్‌లు జరగనున్నట్లు పేర్కొంది. టీ20 సిరీస్‌తో భారత పర్యటన ప్రారంభమవుతుంది. డిసెంబర్ 6 నుంచి నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ సిరీస్ మొదలవుతుంది. అనంతరం జనవరి 12 నుంచి మూడు వన్డేల సిరీస్‌ జరుతుంది. తొలి టీ20 మ్యాచ్ బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానంలో జరగనుంది. అలాగే తొలి టెస్టు మ్యాచ్ అడిలైడ్‌లో ప్రారంభంకానుంది. ఇక సిడ్నీలో తొలి వన్డే జరుగుతుంది.

ఆస్ట్రేలియా షెడ్యూల్..

మొదటి టీ20: నవంబరు 21 – గబ్బా, బ్రిస్బేన్
రెండో టీ20: నవంబరు 23 – ఎంసీజీ, మెల్‌బోర్న్‌
మూడో టీ20: నవంబరు 25 – ఎస్‌సీజీ, సిడ్నీ

మొదటి టెస్ట్: డిసెంబరు 6 – అడిలైడ్ ఓవల్, ఆడిలైట్‌
రెండో టెస్ట్: డిసెంబరు 14 – పెర్త్ స్టేడియం, పెర్త్‌
మూడో టెస్ట్: డిసెంబరు 26 – ఎంసీజీ, మెల్‌బోర్న్‌ (బాక్సింగ్‌ డే టెస్టు)
నాలుగో టెస్ట్: జనవరి 3 – ఎస్‌సీజీ, సిడ్నీ

మొదటి వన్డే: జనవరి 12 – ఎస్‌సీజీ, సిడ్నీ
రెండో వన్డే: జనవరి 15 – అడిలైడ్ ఓవల్, ఆడిలైట్‌
మూడో వన్డే: జనవరి 18 – ఎంసీజీ, మెల్‌బోర్న్‌

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -