Thursday, April 18, 2024
- Advertisement -

బోయపాటి కి అంత సీన్ ఉందా

- Advertisement -

టాలీవుడ్ ప్రముఖ దర్శకులతో బోయపాటి శ్రీను కూడా ఒకరు. మాస్ సినిమాలకి బోయపాటి కేర్ ఆఫ్ అడ్రెస్. బోయపాటి దర్శకత్వం వహించిన ‘వినయ విధేయ రామ’ సినిమా డిసాస్టర్ గా మారింది. ఆ సినిమా విడుదలై 6 నెలలు గడిచింది కానీ ఇంకా బోయపాటి తన తదుపరి సినిమా గురించి ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఇంతకుముందు బోయపాటి బాలకృష్ణ హీరోగా ఒక సినిమా చేయబోతున్నటు వార్తలు బయటకు వచ్చాయి కానీ దాని రించి అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. ‘వినయ విధేయ రామ’ సినిమా డిసాస్టర్ అవడంతో నిర్మాతలు బోయపాటి సినిమాలో ఇన్వెస్ట్ చేయడానికి వెనుకాడుతున్నారని టాక్ కూడా ఉంది. తాజా సమాచారం ప్రకారం బోయపాటి 60 లేదా 70 కోట్లు బడ్జెట్ ఉన్న సినిమా తీయాలని అనుకుంటున్నాడట.

కానీ మరోవైపు బాలకృష్ణ ప్రస్తుతం ఉన్న మార్కెట్ కి 25 కోట్ల కంటే ఎక్కువ థియేట్రికల్ రివ్యూ రెవెన్యూ లు రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో బాలకృష్ణ మీద మరియు బోయపాటి శ్రీను మీద ఇలా ఇంత పెద్ద భారీ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసే నిర్మాతలు చేయడానికి ఏ నిర్మాత ముందుకు రారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా ఈ ప్రాజెక్టుని అందుకే రిజెక్ట్ చేశారట. కనీసం 40 కోట్లు అయినా ఎవరైనా నిర్మాతలు ముందుకు వస్తారు ఏమో కానీ బోయపాటి మాత్రం బడ్జెట్ విషయంలో తగ్గేలా కనిపించడం లేదు. పైగా బోయపాటి సినిమాకి మంచి బిజినెస్ జరుగుతుందని చెబుతున్నారు. కానీ ‘వినయ విధేయ రామ’ డిజాస్టర్ తర్వాత బోయపాటి మార్క్ పై ఉన్న ఇమేజ్ కూడా పోయిందని చెప్పుకోవాలి. మరోవైపు బోయపాటి అంత బడ్జెట్ పెట్టడానికి రెడీ గా ఉండే నిర్మాతల కోసం వెతుకుతున్నట్లు సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -