Thursday, May 16, 2024
- Advertisement -

అందాలు అరబోస్తున్న అక్కినేని భామ

- Advertisement -

హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టడమే అక్కినేని నాగచైతన్య తో ‘సవ్యసాచి’ సినిమాలో నటించింది. ఆ తరువాత అక్కినేని అఖిల్ సరసన ఆమె ‘మిస్టర్ మజ్ను’ సినిమాలో నటించి అక్కినేని హీరోయిన్ గా మారిపోయింది. అయితే మొదటి రెండు సినిమాలు అనుకున్న విజయాన్ని సాధించక పోయేసరికి బాలీవుడ్లో కూడా ‘మున్నా మైఖేల్’ అనే సినిమాతో అదృష్టాన్ని పరీక్షించుకుంది. అక్కడ కూడా బెడిసికొట్టడంతో టాలీవుడ్ వైపు చూసిన ఈ భామ ఇప్పుడు రామ్ సరసన హీరోయిన్ గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఇస్మార్ట్ శంకర్’ అనే సినిమాలో నటిస్తోంది.

ఈమె ఖాతాలో హిట్లు ఏమీ లేకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫ్యాన్ ఫాలోయింగ్ రోజురోజుకీ పెరుగుతూ వస్తోంది. కేవలం మూడే మూడు సినిమాల్లో నటించిన నిధి అగర్వాల్ కు తన ఇంస్టాగ్రామ్ లో మూడు మిలియన్ మంది ఫాలోవర్లు ఉండటం విశేషం. అయితే ఆమెకు అంత ఫ్యాన్ ఫాలోయింగ్ రావడానికి గల కారణాలలో ఒకటి ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసే హాట్ ఫోటోలు అని కొందరు చెబుతున్నారు. అందులో లో నిజం ఉంది. వెండితెర ఫై కంటే నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో మరింత అందాలను ఆరబోస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -