Monday, May 20, 2024
- Advertisement -

తండ్రి కొడుకులు..తాత,మనవళ్లుగా!

- Advertisement -

నిజీ జీవితంలో తండ్రీ, కొడుకులు తాత, మనవళ్లుగా కనిపించబోతున్నారు. వారే హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ . RVS నిఖిల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు బ్రహ్మ ఆనందం అనే టైటిల్‌ని ఖరారు చేశారు.

స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్స్100% సక్సెస్ రేట్‌తో న్యూ ఏజ్ కంటెంట్ బేస్డ్ సినిమాలను రూపొందిస్తోంది. ఇవాళ సినిమా టైటిల్‌ని అనౌన్స్‌ చేస్తూ ప్రీ-లుక్ పోస్టర్, వీడియోను రిలీజ్ చేశారు.

ప్రీ లుక్ పోస్టర్ పట్టణ, గ్రామీణ సంస్కృతుల సమ్మేళనం. గౌతమ్ తదుపరి చిత్రం గురించి బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ మధ్య జరిగిన ఫన్నీ సంభాషణను వీడియో ప్రజెంట్ చేస్తోంది. బ్రహ్మీ, గౌతమ్‌ల పాత్రలని బ్రీఫ్ చేసే ఈ హిలేరియస్ వీడియో సినిమాపై ఆసక్తిని పెంచేసింది. వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషిస్తుండగా ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్‌కల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సినిమా టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్‌ డిసెంబర్‌ 6న వస్తుందని అనౌన్స్‌ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -