Monday, May 20, 2024
- Advertisement -

నాడు బాబు అవినీతి పరుడు..నేడు నీతిమంతుడా?

- Advertisement -

వైసీపీ ప్రభుత్వంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ఆరోపణలు ఖండించారు ఏపీ సీఎం జగన్. చంద్రబాబుపై ప్రధాని మోడీ ప్రశంసలు గుప్పించడాన్ని ఖండించిన జగన్…ఆనాడు అత్యంత అవినీతిపరుడని చెప్పిన నోటితోనే ప్రధాని మోడీ.. ఇప్పుడు ఎన్డీయే గూటికి వచ్చాడని ఆక్షేపించారు. అదే చంద్రబాబు.. ఇప్పుడు నీతిమంతుడు అయ్యారా ? వీరుడు సూరుడు అయ్యారా ? అంటూ ప్రశ్నలు సంధించారు జగన్.

2014-19 మధ్య బీజేపీతో పొత్తులో ఉన్న చంద్రబాబు ఆ తరువాత కూటమి నుంచి వైదొలగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చంద్రబాబును మోసగాడని ప్రధాని మోడీ ఆరోపించారు. పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకున్నాడని, పోలవరాన్ని మంటగలిపారని, కొడుకు కోసమే తప్ప ప్రజల కోసం చంద్రబాబు ఆలోచించరని విమర్శలు చేశారు. ఇదే విషయాన్ని గుర్తు చేసిన జగన్…దీనిపై ఏం సమాధానం చెబుతారన్నారు.

మోడీ సారధ్యంలోని ఎన్డీఎ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ అమ్మేస్తుంటే.. అలాంటి పార్టీతో చంద్రబాబు పొత్తుపెట్టుకున్నారనీ, వీళ్ళిద్దరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్తిని అమ్మేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలో ఉన్నాం కాబట్టి స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ఆగిందన్నారు. స్వార్థ రాజకీయాల కోసం ఎవరు ఏ స్థాయికి దిగజారిపోయారో ఆలోచించాలని ప్రజలను కోరారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -