Monday, May 20, 2024
- Advertisement -

ఆగిన బ్రహ్మోత్సవం

- Advertisement -

మ‌హేష్ బాబు సాధార‌ణంగా దేనికి క‌మిట్ కాడు. ఒక్కసారి క‌మిట్ అయితే…. అత‌ని మాట అత‌నే విన‌డు. కాని చుట్టూ రౌండేసి క‌న్ప్యూజ్ చేస్తే అతను మాత్రం… ఏం చేస్తాడు చెప్పండి. ఓ దారికి రావ‌డం తప్ప.

బ్రహ్మోత్సవం చిత్రం విష‌యంలో సరిగ్గా అదే జ‌రిగింద‌ని ప‌రిశ్రమ చెబుతుంది. ఇంత‌కీ బ్రహ్మోత్సవాన్ని మహేష్ అర్దాంత‌రంగా ఎందుకు ఆపేసిన‌ట్లు. శ్రీమంతుడు రిలీజ్ అయ్యే లోపు వీలైతే ఓ షెడ్యూల్ కూడా ఫినిష్ చేయాల్సిన మ‌న నాని బాబు(ఒక‌ప్పుడు మ‌హేష్ ను అంతా నాని అనేవారు.నాని అనే హీరో వ‌చ్చాక అలా పిలిపించుకోవ‌డం మానేశాడు)

పివిపి చెప్పాడ‌ని సినిమాకు చెక్ పెట్టాడు. అలా అని చెప్పి సినిమా లేద‌నుకునేరు. విష‌యం ఏంటా అని ఆరా తీస్తే తెలిసిందేంటంటే….

మ‌హేష్ బాబు గారు వ‌రుస‌గా ఫ్యామిలీ సినిమాలు చేయ‌డం ఏం భాగాలేద‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెప్పాయ‌ట‌. ఇప్ప‌టికే సీత‌మ్మ  తీసి మ‌ళ్లీ శ్రీమంతుడుతో ఫ్యామిలీ ట‌చ్ ఇచ్చి…అది చాల‌ద‌న్న‌ట్లు ఇలా బ్ర‌హ్మోత్సవం తీస్తానంటే ఎలా అంటూ ప్ర‌శ్నించారు. ఇమేజ్ మ‌రింత పెంచుకోవాలంటే జోన‌ర్ దాటి రిస్క్ చేయ‌క త‌ప్ప‌దు. సో అందుకోస‌మైనా మ‌హేష్ ఈసినిమాను క‌థ‌ను మార్చుకునే ఆల‌చ‌న‌లో ప‌డిపోయాడ‌ట‌.

అంతేనా….శ్రీమంతుడు చిత్రం రిలీజ్ అయ్యాక అప్ప‌టి టాక్ బ‌ట్టి ఈసినిమా క‌థ‌,క‌థ‌నాల‌కు మ‌రింత మెరుగులు దిద్ది…జ‌నాల ఆలోచ‌న‌ల‌కు త‌గ్గ‌ట్టుగా బ్ర‌హ్మోత్స‌వాన్ని తీయాల‌ని చూస్తున్నార‌ట‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -