Wednesday, May 8, 2024
- Advertisement -

ఫైట్స్ లేని బోయపాటి ఊహించ గలరా ?

- Advertisement -

క్రిటిక్ ల దగ్గర నుంచి బాలేదు అనే టాక్ ఒచ్చినా కూడా బోయపాటి మాస్ క్రౌడ్ పుల్లింగ్ ఏమో కానీ సరైనోడు సినిమా చక్కగా ఆడుతోంది. మొదటి రోజు నెగెటివ్ టాక్ ఒచ్చినప్పటికీ సినిమా ఇప్పుడు యాభై కోట్ల కలక్షన్ ల వరకూ వెళుతోంది అంటే అది కచ్చితంగా ఫైట్ లూ యాక్షన్ సీన్ ల వలెనే అని చెప్పాలి.

అయితే తన తరవాత సినిమాకి ఇవన్నీ ఏమీ ఉండవు అని షాక్ ఇస్తున్నారు బోయపాటి శ్రీను. బోయపాటి తర్వాత తీస్తున్న సినిమా బెల్లంకొండ  సాయి శ్రీనివాస్ తో.. ఇన్నాళ్లు కాస్త వయిలెన్స్ డోస్ ఎక్కువున్న సినిమాలను తీసిన ఈ దర్శకుడు మొదటిసారి తన పంథా మార్చుకుని ప్రేమకథ తీస్తున్నాడట.

అంతేకాదు బోయపాటి సినిమాలంటే ముందుగా గుర్తొచ్చేది ఫైట్స్.. అయితే బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలో కేవలం రెండు ఫైట్ ఎపిసోడ్స్ తోనే సినిమా ముగించేస్తున్నా అంటున్నాడు ఈ దర్శకుడు. సినిమాలు హిట్ అవుతున్న భయంకరమైన ఊచకోత ఉంటే ఫ్యామిలీ ఆడియెన్స్ సినిమా చూసేందుకు ఇష్టపడట్లేదు. అందుకే వారి కోసం రూట్ మార్చుకుని తనను తాను కొత్తగా ప్రెజెంట్ చేయాలనుకుంటున్నాడు బోయపాటి శ్రీను. మరి ఈ దర్శకుడు చేసే ఈ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -