Tuesday, May 7, 2024
- Advertisement -

సర్దార్ – బాహుబలి తరవాత ఎన్టీఆర్

- Advertisement -

ఈ ఇయర్ భారీ ఆశలు పెట్టుకున్న సర్దార్ గబ్బర్ సింగ్ టోటల్ గా నిరాశపరిచి టాలీవుడ్ బిగ్గెస్ట్ ఫ్లాఫ్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. కానీ సినిమా ఫ్లాఫ్ టాక్ తోనూ 50 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసి చరిత్ర సృష్టించింది.

విడుదలకి ముందు భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సర్దార్ గబ్బర్ సింగ్ నెల్లూరు ఏరియాలో బాహుబలి తరువాత రెండో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇప్పుడు బాహుబలి-సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాల తరువాత అక్కడ మూడో బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతాగ్యారేజ్ రికార్డులకెక్కింది. ఈ సినిమాకు నెల్లూరు ఏరియాలో సుమారు 2.40 కోట్ల రేటు దక్కింది.

ఈ అమౌంట్ కొద్దిగా తక్కువగానే అనిపించినా నెల్లూరు ఏరియాలో కలెక్షన్స్ మిగిలిన ఏరియాలతో పోల్చితే తక్కువగా ఉంటాయి. అలాంటి చోట ఈ రేంజ్ రేటు అంటే నిజంగానే గ్రేట్ అంటున్నారు ట్రేడ్ పండితులు. ఎన్టీఆర్ సినిమాకు ఎలాంటి క్రేజ్ ఉందో చెప్పడానికి ఇదే నిదర్శనం అంటున్నారు. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ వచ్చే నెల 20 న రిలీజ్ కాబోతుంది. సినిమాను ఆగస్టు 12 న రికార్డు స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -