Thursday, May 9, 2024
- Advertisement -

హీరోయిన్ క‌నిపించ‌డం లేదంటు కేసు న‌మోదు!

- Advertisement -

హీరోయిన్ ఎక్క‌డ క‌నిపిచ‌డం లేదంటు పోలీసు స్టేష‌న్‌లో ఓ కేసు న‌మోదైంది.అయితే ఇది జ‌రిగింది మ‌న ఇండియాలో కాదు.ఈ సంఘ‌ట‌న మ‌న ప‌క్క దేశం అయిన చైనాలో జ‌రిగింది.ఫ్యాన్‌ బింగ్‌బింగ్ అనే హీరోయిన్‌కు చైనాలో బాగా ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఉంది.ఆమె గత కొన్నిరోజులుగా కనిపించక పోవటంతో ఆమె అభిమానులు అందోళ‌న‌కు దిగారు.ఈ క్రమంలో ఆమె ఎక్కడుందో అంటూ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున్న ఆరా తీస్తున్నారు.ఆమెపై గ‌త కొన్ని రోజులుగా పన్నుల ఎగవేత ఆరోపణలు వ‌స్తున్నాయి.

ఈ క్ర‌మంలోనే ఆమె క‌నిపించ‌డం లేద‌ని తెలుస్తుంది.గత నెలరోజులుగా ఆమె గురించి ఎలాంటి సమాచారం లేకపోవటంతో ఏం జరిగిందోనని ఫ్యాన్స్‌ అల్లలాడిపోతున్నారు.36 ఏళ్ల ఫ్యాన్‌ బింగ్‌బింగ్‌. 2014లో వచ్చిన ఎక్స్‌ మెన్‌-డేస్‌ ఆఫ్‌ ఫ్యూఛర్‌ పాస్ట్‌ లోని బ్లింక్‌ పాత్ర ద్వారా ఆమె బాగా పాపులర్‌ అయ్యారు.అంతర్జాతీయంగా అత్యధికంగా రెమ్యూనరేషన్‌లు అందుకునే తారల్లో ఫ్యాన్‌ బింగ్‌బింగ్ ఒకరు. ఫ్యాన్‌ బింగ్‌బింగ్‌కు సోష‌ల్ మీడియాలో విప‌రీత‌మైన ఫాలోయింగ్ ఉంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -