Tuesday, May 21, 2024
- Advertisement -

భారీ న‌ష్టాల‌తో ముగిసిన స్టాక్ మార్కెట్లు…

- Advertisement -

వరుస రికార్డుల తరువాత స్టాక్‌మార్కెట్లు రెండోరోజు నష్టాలను నమోదు చేశాయి. ఆరంభ నష్టాలనుంచి ఏమాత్రం పుంజుకున్న ధోరణి కనిపించలేదు. ట్రేడర్ల అమ్మకాలతో కీలక సూచీలు మిడ్‌ సెషన్‌ తరువాత మరింత డీలా పడ్డాయి. కీలక వడ్డీ రేట్లను పెంచుతూ ఆర్బీఐ నిన్న తీసుకున్న నిర్ణయం ప్రభావం బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సెక్టార్లపై పడింది. వీటితో పాటు ఆటో స్టాకులు కూడా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోవడంతో మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి… సెన్సెక్స్ 356 పాయింట్లు నష్టపోయి 37,165కు చేరుకుంది. నిఫ్టీ 101 పాయింట్లు కోల్పోయి 11,244కు దిగజారింది. ఆర్‌బీఐ రెపో రేటుకోతు అంతర్జాతీయ ప్రతికూలత దేశీయ మార్కెట్లను ప్రభావితం చేసింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రీటెయిల్ (12.49%), దిలీప్ బిల్డ్ కాన్ (6.99%), జెట్ ఎయిర్ వేస్ (6.50%), ఎన్బీసీసీ ఇండియా (6.09%), ఐనాక్స్ విండ్ లిమిటెడ్ (5.35%).

టాప్ లూజర్స్:
మారీకో లిమిటెడ్ (-4.78%), ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్ (-4.67%), గతి లిమిటెడ్ (-4.01%), అదానీ పవర్ (-3.86%), రెడింగ్టన్ ఇండియా (-3.72%).

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -