Friday, May 3, 2024
- Advertisement -

రజినీకాంత్ సినిమాని విడుదల అవ్వకుండా ఆపుతోంది ఎవరు ?

- Advertisement -

ఒక పక్క రజినీకాంత్ ఆరోగ్యం బాలేదు మరొక పక్క కబాలి విడుదల తేదీలో తీవ్రమైన జాప్యం జరుగుతోంది ఈ గోలలో పిచ్చ చిరాకుగా ఉన్నారు రజినీకాంత్ ఫాన్స్. నిజానికి కబాలి సినిమా విడుదల కి ముందర రజినీకాంత్ యూ యస్ నుంచి వస్తారు అని వార్తలు రావడం తో ఆ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నారు అభిమానులు.

విడుదల తేదీ మీద జూలై 15 అని ప్రింట్ అయ్యాక కూడా ఇప్పుడు విడుదల తేదీ లో గ్యారంటీ లేదు. అయితే విషయం ఎంటా అని ఆరా తీస్తే తెల్సింది ఏంటంటే తమిళనాడు లో వచ్చిన కొత్త సెన్సార్ నిబంధనలు ఈ సినిమాని అడ్డుకుంటున్నాయి. ఓ సినిమాకు సెన్సార్ అవ్వకుండా రిలీజ్ డేట్ ఇవ్వకూడదని అక్కడి సెన్సార్ బోర్డు నిబంధన తెచ్చింది.

ముందు రిలీజ్ డేట్ ఇచ్చేసి.. ఆ తర్వాత సెన్సార్ దగ్గర ఏవైనా ఇబ్బందులు తలెత్తితే రిలీజ్ డేట్ ఇచ్చేశామంటూ నిర్మాతలు ఒత్తిడి తెస్తుండటంతో సెన్సార్ బోర్డు ఈ రకమైన నిబంధన తెచ్చింది. సెన్సార్ అవ్వకుండా రిలీజ్ డేట్ ప్రకటించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. అందుకే మొన్న ‘కబాలి’ తెలుగు ఆడియో విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడిన దర్శకుడు పా రంజిత్ ను రిలీజ్ డేట్ గురించి అడిగినా సమాధానం చెప్పలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -