Saturday, May 10, 2025
- Advertisement -

’ప్రేమమ్‌’ పైరసీ కేసులో సెన్సార్‌బోర్డు వ్యక్తి అరెస్ట్‌!

- Advertisement -

మ‌ళ‌యాలంలో వ‌చ్చిన ప్రేమ‌మ్ చిత్రం ఇపుడు అక్క‌డ స‌రికొత్త వండ‌ర్స్ ను క్రియేట్ చేస్తోంది. ఒక వ్య‌క్తి అన్ని ద‌శ‌ల్లోను ప‌డే ప్రేమ‌ను అత్య‌ధ్బుతంగా చూపించిన సినిమా ప్రేమ‌మ్ . ఈ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్ గా 70కోట్లకు పైగా క‌లెక్ట్ చేసింది.

సినిమా వ‌చ్చి 50 రోజులైనా ఇంకా ఈఫిలింకు వ‌సూళ్ళ వ‌ర‌ద తాకిడి త‌గ్గలేదు.

దృశ్యం రికార్డుల‌ను సైతం ఈ ఫీల్ గుడ్ ల‌వ్ స్టోరీ బ్రేక్ చేసేసింది. అయితే ఈ సినిమా థియేటర్‌లలో విడుదలైన రెండు రోజులకే ఆన్‌లైన్‌లో పైరసీ వచ్చేసింది. దీంతో సినిమా నిర్మాత పోలీసులకు పిర్యాదు చేయడంతో, పోలీసులు దర్యాప్తు నిర్వహించారు.

సెన్సార్ బోర్డు తాత్కాలిక ఉద్యోగిగా పనిచేసే అరుణ్‌కుమార్ ’ప్రేమమ్’ సినిమా సీడీని  కాపీ చేసి వేరే వాళ్ళకు అమ్మేసినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసులో అరుణ్‌కుమార్‌తో పాటు మరో ఇద్దరు నిందితులను కూడా అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు.  

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -