Friday, April 26, 2024
- Advertisement -

పుట్టిన రోజు ఝలక్.. డ్రగ్స్ కేసులో సినీ నటి అరెస్ట్..

- Advertisement -

బర్త్​డే పార్టీలో మాదక ద్రవ్యాలు వాడరన్న ఆరోపణలతో ఓ బాలీవుడ్‌ నటిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. సాధారణంగా ఇంజక్షన్, పౌడర్ లాంటి రూపాల్లో సేవిస్తారని వాటిని సేవించి మత్తులో ఊగిపోతుంటారు. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ రాకెట్ అనే అంశం పలుమార్లు సంచలనం సృష్టించిన సంగతి మనందరికీ తెలుసు. తాజాగా తన బర్త్ డే పార్టీలో మాదక ద్రవ్యాల వినియోగించారనే ఆరోపణలో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. ముంబై నగరం జుహులోని ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో బాలీవుడ్‌ యువ నటి నైరా నేహాల్‌ షా తన స్నేహితులతో కలిసి పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంది.

ఇందులో భాగంగా తన స్నేహితుల ఇష్టం మేరకు డ్రగ్స్ కూడా తెప్పించినట్టు పోలీసులకు సమాచారం వెళ్ళింది. దీంతో వాళ్ళు వెంటనే రంగంలోకి దిగి నైరాని అలాగే ఆమె స్నేహితులను అరెస్ట్ చేశారు. ఈ వేడుకకి గోవాకు చెందిన నైరా స్నేహితుడు ఆషిక్ హుస్సేన్ ను కూడా హాజరయ్యి.. డ్రగ్స్ లో పాలుపంచుకున్నట్టు తెలుస్తుంది. పుట్టిన రోజు వేడుకలు నిర్వహించిన నటి నైరా నేహాల్‌ షాతో పాటు ఆమె స్నేహితులను అరెస్టు చేసి జైలుకు తరలించారు.

వీరిద్దరిని కోర్టులో హాజరుపర్చగా ఇద్దరికీ బెయిల్ లభించిందని తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ బర్త్ డే పార్టీలో డ్రగ్స్ ఎలా వచ్చాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. క నైరా తెలుగులో ఆది హీరోగా వచ్చిన ‘బుర్ర కథ’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. అయితే ఆ చిత్రం పెద్దగా ఆడకపోవడంతో ఈమెకు తెలుగులో అవకాశాలు రాలేదు. అయినప్పటికీ ఈమె బాలీవుడ్లో కూడా బాగా ఫేమస్ అన్న సంగతి తెలిసిందే.

తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్‌కు నటుడు విజయ్ సేతుపతి రూ. 25లక్షలు సాహాయం…

ఇండస్ట్రీలో వరుస మరణాలు కలచి వేస్తున్నాయి!

అదిరిపోయే శుభాకాంక్షలు చెప్పిన చిరు.. కొరటాలకు మరుపురాని కానుక!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -