Thursday, March 28, 2024
- Advertisement -

‘మహానటి’లో తాత పాత్ర‌లో అక్కినేని హీరో

- Advertisement -

అల‌నాటి అందాల న‌టి సావిత్రి జీవిత చ‌రిత్ర‌పై నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న సినిమా ‘మహానటి’. ఈ సినిమాలో సావిత్రి పాత్ర‌లో కీర్తి సురేశ్‌, జమునగా సమంత, జెమినీ గణేశన్‌గా దుల్కర్ సల్మాన్, ఎస్వీ రంగారావుగా మోహన్‌బాబు, నాగిరెడ్డిగా ప్రకాశ్‌రాజ్ పాత్ర‌లు ఎంపిక‌య్యారు. కానీ అక్కినేని నాగేశ్వ‌ర్‌రావు పాత్ర చేయ‌డానికి ప‌లువురిని సంప్ర‌దించ‌గా ఇప్పుడు ఒక్క హీరో ఫైన‌ల్ అయ్యాడ‌ని స‌మాచారం.

సావిత్రితో ఏఎన్నార్ ఎన్నో సినిమాల్లో న‌టించాడు. వ్య‌క్తిగ‌తం ఏఎన్నార్‌, సావిత్రి మంచి మిత్రులు. ఈ నేప‌థ్యంలో సావిత్రి జీవిత చ‌రిత్ర‌పై తీసే సినిమాలో ఏఎన్నార్ లేక‌పోతే ఎలా? అందుకే ‘మహానటి’లో ఏఎన్నార్ పాత్రను పెట్టారు. అయితే ఈ పాత్ర‌లో అక్కినేని నాగ‌చైత‌న్య న‌టించ‌డానికి అంగీక‌రించాడ‌ని స‌మాచారం. తాత పాత్ర‌లో న‌టించ‌డానికి చైతై ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నాడు.అయితే సీనియర్ ఎన్టీఆర్ పాత్రకు జూనియర్ ఎన్టీఆర్‌ను అనుకోగా అత‌డు అంగీక‌రించ‌లేద‌ని తెలుస్తోంది. ఏఎన్నార్ పాత్రలో కనిపించడానికి చైతూ ఓకే చెప్పాడట. తన మీద తీసే సన్నివేశాల కోసం రెండు రోజులు డేట్లు కూడా కేటాయించాడు చైతూ. తాతలా కనిపించడానికి చైతూ కొన్ని కసరత్తులు చేస్తున్నాడు.

‘ఎవడే సుబ్రమణ్యం’ తీసిన ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ ‘మహానటి’ సినిమాకు దర్శకత్వం చేస్తున్నాడు. వైజయంతీ మూవీస్ బ్యాన‌ర్‌లో రూపొందుతున్న ఈ సినిమాను మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా జూన్ ప్రారంభంలో విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -