Monday, May 20, 2024
- Advertisement -

క‌ట్టుకున్న ఆమెపైనే హీరో అనుమానం

- Advertisement -

అనుమానంతో డిటెక్టివ్ పెట్టి విచార‌ణ‌

క‌ట్టుకున్న భార్య‌పై అనుమానం పెంచుకున్నాడు. ఆమె ఎవ‌రితోనూ మాట్లాడుతోంద‌ని ఏకంగా ప్రైవేటు డిటెక్టివ్‌ల‌ను నియ‌మించి కాల్‌డేటా రికార్డింగ్ చేయించాడ‌ని ఓ బాలీవుడ్ యాక్ట‌ర్‌పై ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ఇది అత‌డి కెరీర్‌ను దెబ్బ‌తీసే అవ‌కాశం ఉంది. మొన్న క్రికెట‌ర్ షమీపై అత‌డి భార్య తీవ్ర ఆరోప‌ణ‌లు చేయ‌గా ఇప్పుడు బాలీవుడ్ న‌టుడు త‌న భార్య‌పై ఈ విధంగా చేయ‌డం ఆందోళ‌న‌కు గురిచేస్తోంది.

కాల్‌ డేటా రికార్డ్‌ స్కామ్‌కు పాల్ప‌డ్డాడ‌ని బాలీవుడ్ న‌టుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ఇర‌కాటంలో ప‌డ్డాడు. అత‌డికి శనివారం (మార్చి 10) పోలీసులు సమన్లు జారీ చేసి విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని కోరారు. విలక్షణ నటుడిగా గుర్తింపు పొందుతున్న నవాజుద్దీన్ తన భార్య అంజలిపై అనుమానంతో ఓ డిటెక్టివ్‌ను నియమించాడని.. ఆమె కాల్‌డేటాను సేకరించాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి.వ్యక్తిగత కాల్స్‌ను ట్రాప్‌ చేస్తున్నారంటూ కొందరు ఫిర్యాదులు రావడంతో మ‌హారాష్ట్ర‌లోని థానే క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇది చిన్న విష‌యం కాదని పోలీసులు.. కాల్‌ డేటా రికార్డ్‌ స్కామ్‌ పేరిట దర్యాప్తును వేగ‌వంతం చేశారు. అయితే ఈ కేసులో మొత్తం 11 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో న‌లుగురు ప్రైవేట్‌ డిటెక్టివ్‌లు కూడా ఉన్నారు.

నవాజ్‌ తన భార్యపై అనుమానంతో నిఘా వేయించాడని, కాల్‌ డేటా సేకరించాడని ఓ డిటెక్టివ్‌ వెల్లడించాడు. అందుకు గానూ నవాజ్‌ తనకు రూ. 50 వేల దాకా చెల్లించాడని మీడియాతో చెప్పాడు. ఈ నేప‌థ్యంలో విచారణకు హాజ‌రుకావాల‌ని నవాజుద్దీన్‌ను పోలీసులు కోరారు. వారి విన‌తిని ప‌ట్టించుకోక‌పోవ‌డంతో న‌వాజుద్దీన్‌కు థానే పోలీసులు సమన్లు జారీ చేశారు.అయితే దీనిపై న‌వాజుద్దీన్ సోష‌ల్ మీడియాలో స్పందించాడు. ఈ ప్ర‌చారం అస‌త్యం అని తేల్చిచెప్పాడు. అసత్య ఆరోపణలపై మీడియా తనను ప్రశ్నించడం దిగ్భ్రాంతి కలగజేస్తోందని బాధ వ్య‌క్తం చేశాడు. మ‌రీ త‌దుప‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -