Thursday, May 23, 2024
- Advertisement -

చంద్ర‌బాబు బ‌యోపిక్ ఫ‌స్ట్ లుక్ రిలీజ్

- Advertisement -

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో బ‌యోపిక్‌ల హడావిడి న‌డుస్తుంది. తెలుగులో ఇప్పటికే సావిత్రి జీవితంతో తెరకెక్కించిన ‘మహానటి’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకుంది. ఇక ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రులు అయిన‌ ‘ఎన్టీఆర్’, ‘వైఎస్సార్’ల బయోపిక్ లు సెట్స్ పై ఉన్నాయి. తాజాగా ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బయోపిక్ ను కూడా చిత్రీకరిస్తున్నారు. ‘చంద్రోదయం’ పేరుతో చంద్ర‌బాబు జీవితక‌థ‌ను ఈ సినిమాగా తెర‌కెక్కిస్తున్నారు.తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.

టైటిల్, చంద్రబాబు ఫొటోతో సింపుల్‌గా ఫస్ట్ లుక్ విడుద‌ల చేశారు. చంద్రబాబు పాత్రను వినోద్ నువ్వుల పోషించబోతున్నారని చిత్ర దర్శకుడు పి.వెంకటరమణ వెల్లడించారు.చంద్రబాబు చిన్నతనం నుండి రాజకీయనాయకుడిగా ఎదిగిన క్రమాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నారం. అక్టోబర్ 18న ఈ సినిమా విడుదల కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -