Monday, May 20, 2024
- Advertisement -

ప్రజల కోసం నిర్ణయం మార్చుకోవాల్సిన సంకటస్థితిలో జగన్

- Advertisement -

జగన్ పట్టుదల గురించి కొత్తగా చెప్పేదేముంది? తలవంచని నైజం, ఆత్మస్థైర్యం విషయంలో కూడా తెలుగు నేలపై ఉన్న అందరు నాయకులకంటే జగనే అగ్రస్థానంలో నిలుస్తాడు. అయితే ఇప్పుడు ఒక విషయంలో మాత్రం తన పోరాట పంథాను మార్చుకోవాల్సిన సంకటస్థితిలో జగన్ నిలిచాడు. జగన్ చుట్టూ అలాంటి పరిస్థితిని క్రియేట్ చేయడంలో ప్రత్యర్థులు సక్సెస్ అయ్యారు. వాళ్ళ ఉద్ధేశ్యాలు ఏవైనప్పటికీ ప్రజల దృష్టిలో పలచన అవ్వకూడదంటే ఇప్పుడు తప్పనిసరిగా తన నిర్ణయం మార్చుకోవాల్సిన పరిస్థితిలో జగన్ ఉన్నాడు.

టిడిపి ప్రభుత్వంలో స్పీకర్ వ్యవస్థ ఎంతలా దిగజారిందో చూస్తూనే ఉన్నాం. కోడెల శివప్రసాదరావు టిడిపి నేతలు అందరికంటే పెద్ద టిడిపి నాయకుడిగా వ్యవహరిస్తూ చంద్రబాబును పొగడడం, చంద్రబాబు విగ్రహానికి పాలాభిషేకం చేయడంతో పాటు అసెంబ్లీలో కూడా పూర్తిగా టిడిపి పక్షాన నిలిచాడు. పార్టీ ఫిరాయించిన నేతల విషయంలో పూర్తిగా విలువలకు పాతరేశాడు. చంద్రబాబు ప్రభుత్వం కూడా ప్రతిపక్షం వాయిస్‌ని అస్సలు పట్టించుకోలేదు. అందుకే అసెంబ్లీలో అడుగుపెట్టకూడదని జగన్ నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయం తీసుకోవడం పరిస్థితులను బట్టి చూస్తే సబబే అనిపించొచ్చు.

అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా టిడిపికి వ్యతిరేకంగా ఏదో చేస్తున్నా అని చెప్పి ఎన్నికల ఏడాదిలో పబ్లిసిటీ స్టంట్స్ చేస్తున్న నేపథ్యంలో ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో జగన్ మరోసారి తనను తాను నిరూపించుకోవాల్సిన పరిస్థితి. అలాగే అసెంబ్లీలో వైఎస్ జగన్ ప్రసంగాలు వైకాపా శ్రేణులకు ఉత్సాహాన్ని ఇచ్చేవి. చంద్రబాబుతో సహా అందరినీ కూడా జగన్ కార్నర్ చేసిన వైనం ఆంధ్రప్రదేశ్ ప్రజలను కూడా మెప్పించింది. ఇప్పుడు ఎన్నికల ఏడాదిలో చివరి సమావేశాల్లో అయినా కచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళి టిడిపి ప్రభుత్వాన్ని నిలదీయడలో మరోసారి జగన్ సక్సెస్ అయితే మాత్రం వైకాపా శ్రేణులకు అది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అవుతుంది. అలాగే నాయకుడిగా జగన్ సామర్థ్యం కూడా ప్రజలకు మరోసారి అవగతమవుతుంది. వంద ప్రశ్నలకు సమాధానంగా నిలిచిపోయే అవకాశం ఉన్న ఈ విషయంలో అసెంబ్లీ సమావేశాలకు హాజరవకూడదు అన్న తన నిర్ణయాన్ని మార్చుకుంటేనే బాగుంటుందని వైకాపా శ్రేణులు కూడా అభిప్రాయపడుతున్నాయి. వైఎస్ జగన్ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -