Tuesday, May 7, 2024
- Advertisement -

పూరి- నితిన్ ల సినిమా ఆగడానికి కారణం చార్మినా?!

- Advertisement -

దర్శకుడు పూరి జగన్నాథ్, హీరో నితిన్ ల సినిమా ఆగిపోవడానికి కారణం హీరోయిన్ చార్మినా? ఆమె తీరు వల్లనే పట్టాలెక్కాల్సిన ఈ సినిమా ఆగిపోయిందా? ప్రత్యేకించి హీరో నితిన్ కు చార్మి తీరు నచ్చలేదా? అందుకే అతడు ఈ సినిమా ఆగిపోయినట్టుగా ప్రకటించాడా? అనే సందేహాలు రేగుతున్నాయిప్పుడు. మరి ఇంతకీ చార్మి ఆ సినిమాకు ఎలా అడ్డు అయ్యింది? అంటే.. దాని వెనక పెద్ద కథే ఉంది!

 

పూరి దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించబోయే సినిమా ప్రతిపాదనలో ఉన్న దశలో చార్మి దానిలో ఇన్ వాల్వ్ అయ్యిందని టాక్. తాజాగా ‘జ్యోతిలక్ష్మి’ సినిమాతో నిర్మాతగా మారిన చార్మి పూరి- నితిన్ సినిమాలో వేలు పెట్టిందట. దాంట్లో  తను కూడా ఇన్వెస్ట్ చేస్తాననంటూ మొదలు పెట్టిందని అంటున్నారు. దర్శకుడు పూరితో తనకు ఉన్న సాన్నిహిత్యం కొద్దీ ఆమె ఈ సినిమాలు పెట్టుబడి పెడతానంటూ ఒత్తిడి చేసుకొచ్చినట్టుగా తెలుస్తోంది.

 అయితే తను హీరోగా నటించే సినిమాను ఓన్ గా ప్రొడ్యూస్ చేసుకొనే ఆలోచనతో ఉన్న నితిన్ కు చార్మి తీరు నచ్చనట్టుగా తెలుస్తోంది. దీంతో.. అతడు సినిమాను ఆపేయడమే  మేలు అనుకొన్నట్టుగా తెలుస్తోంది. ఆమె ఇన్ వాల్వ్ కు పూరి కూడా అభ్యంతరం చెప్పకపోవడంతో.. నితిన్ తను ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకొంటున్నట్టుగా ప్రకటన చేసేశాడని తెలుస్తోంది. అయితే చార్మి మాత్రం ఈ విషయాన్ని ఖండిస్తోంది. తన ఇన్ వాల్వ్ మెంట్ ఏ మాత్రం లేదని ఆమె చెబుతోంది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -