Friday, April 26, 2024
- Advertisement -

‘భీమ్లా నాయక్’ లో భారీ ఛేజింగ్ సీన్…

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ మూవీ భీమ్లా నాయక్. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్ మూవీకి ఇది రీమేక్. ఈ సినిమాకు సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తుండగా, త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నాడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ఈ సినిమా నిర్మితమవుతోంది.

ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఫస్ట్ గ్లింప్స్ మంచి స్పందన వచ్చింది.
అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక భారీ ఛేజింగ్ సీన్ హైదరాబాద్ – రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా సమాచారం.

ఇంటర్వెల్ కి ముందొచ్చే ఈ సీన్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని తెలుస్తుంది. ఈ సీన్ లో పవన్ కల్యాణ్ తో పాటు రానా కూడా ఉంటాడని తెలుస్తుంది. గబ్బర్ సింగ్ తర్వాత మళ్లీ యాక్షన్ మోడ్ లో పవన్ కళ్యాణ్ ని చూడాలని అభిమానులు కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్నారు. భీమ్లా నాయక్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.

మన హీరోలు వాడే కార్లు వాటి ఖరీదు ఎంతంటే ?

టాలీవుడ్ లో విలన్స్ గా ఎంట్రీ ఇచ్చిన స్టార్ హీరోలు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -