Friday, March 29, 2024
- Advertisement -

టాలీవుడ్ లో విలన్స్ గా ఎంట్రీ ఇచ్చిన స్టార్ హీరోలు..!

- Advertisement -

టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంతో మంది నటులు వస్తుంటారు పోతుంటారు. ఎన్నో ఒడిదుడుకులు అన్నిటిని అదిగమించి అతి కొంత మంది మాత్రమే పాతుకుపోతుంటారు. కేరియర్ ను విలన్ గా మొదలు పెట్టి.. ప్రస్తుతం స్టార్ హీరోలుగా ఎదిగిన వారు కూడా ఉన్నారు. విలన్ గా ఎంట్రీ ఇచ్చి హీరోలుగా మారిన వారు చాల మందే ఉన్నారు.. కానీ సక్సెస్ అయిన వారు మాత్రం అతికొద్ది మందే..! అలా ఇండస్ట్రీకి లోకి విలన్స్ గా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం స్టార్ హీరోలుగా ఎదిగినవారుని ఇప్పుడు చూద్దాం.

చిరంజీవి: కుక్కకాటుకు చెప్పు దెబ్బ, మోసగాడు, 47 రోజులు ఇలాంటి సినిమాలతో విలన్ గా గుర్తింపు చెచ్చుకొని హీరోగా చిన్న చిన్న సినిమాలు చేస్తు ఖైదీ సినిమాతో స్టార్ డమ్ తెచ్చుకిని మెగాస్టార్ స్థాయికి ఎదిగారు.
కృష్ణంరాజు: నేనంటే నేనే, భ‌లే మాస్టర్ వంటి సినిమాల్లో విలన్ గా నటించి తర్వాత హీరోగా ఎన్నో సినిమాలు చేసి రెబల్ స్టార్ అయ్యారు.
రజినీకాంత్: కథా సంగమం, బాలు జాన్ వంటి కన్నడ సినిమాలతో విలన్ గా నటించి తమిళ్, తెలుగులో హీరోగా గుర్తింపు తెచ్చుకొని సౌత్ ఇండియా సూపర్ స్టార్ గా ఎదిగారు.

మోహన్ బాబు: అప్పట్లో అగ్ర హీరోల సిమాలలో టాప్ విలన్ గా పేరు తెచ్చుకున్న విలక్షన నటుడు. అల్లుడు గారు సినిమాతో హీరోగా కలెక్షన్ కింగ్ అయ్యారు.
రాజశేఖర్: సైడ్ క్యారెక్టర్స్ తో పరిచయమై తలంబ్రాలు సినిమాలో విలన్ గా గుర్తింపు చెచ్చుకొని ఆహుతి, అంకుశం సినిమాలతో హీరో గా యాంగ్రీ యంగ్ మాన్ అయ్యారు.
రవితేజ: చిన్న క్యారెక్టర్ తో మొదలైన రవితేజ కేరియర్ తర్వాత సముద్రం, సీతారామరాజు వంటి సినిమాలతో విలన్ గా ఎంట్రీ ఇచ్చి‌ సెకండ్ హీరో, సైడ్ రోల్స్ చేస్తూ ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్ సినిమాలతో టాప్ హీరోగా ఎదిగారు.

గోపిచంద్: జయం, నిజం, వర్షం సినిమాలతో విలన్ గా పరిచయమైన గోపి చంద్ తొలివలపు, యజ్ఞం, రణం సినిమాలతో హీరోగా మారారు.
శ్రీకాంత్: ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, అబ్బాయి గారు, వారసుడు సినిమాలతో విలన్ గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్ తర్వాత సైడ్ హీరో రోల్స్ చేస్తూ పెళ్లి సందడి సినిమాతో స్టార్ హీరో అయ్యారు.
జెడి చక్రవర్తి: శివ సినిమాతోనే విలన్ గా పరిచమై.. చిన్న చిన్న విలన్ ప్రాత్రలు చేస్తూ.. గులాబి సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు.
శ్రీహరి: రౌడీ ఇన్స్పెక్టర్, ముఠా మేస్త్రి, కలసుందాం రా, ప్రేమంటే ఇదేరా, శ్రీరాములయ్య సినిమాల్లో విలన్ గా గుర్తింపు తెచ్చుకొని పోలీసు సినిమాతో హిరో అయ్యారు.

Also Read

టాలీవుడ్ హీరోయిన్స్ ఎక్కడ.. ఏం చదువుకున్నారో తెలుసా ?

టాలీవుడ్ లో ఎంత మంది డాక్టర్లు ఉన్నారో చూడండి..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -