మన హీరోలు వాడే కార్లు వాటి ఖరీదు ఎంతంటే ?

- Advertisement -

మన స్టార్ హీరోలకు లగ్జరీ కార్లను కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక మన ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరోలు ఉపయోగించే లగ్జరీ కార్లను గురించి తెలుసుకుందాం..

టాలీవుడ్ లో చిరంజీవికి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే చిరుకు కార్లు అన్న వాటి నెంబర్లు అన్న కాస్త సెంటిమెంట్ ఎక్కువ. చిరంజీవి ఇంట్లో లేని కారు లేదు. కానీ తను కొన్న మొదటి ఫారిన్‌ కారు హోండా అకార్డ్‌ చాలా ఇష్టమంటున్నాడు. ఇది కాకుండా చిరు దగ్గర ఉన్న పెద్ద కార్లు ఏంటో ఇప్పుడు చూద్దాం. రోల్స్‌ రాయిస్‌ ఫాంటమ్‌ ఖరీదు సుమార్ గా 3.34కోట్లు. చిరంజీవి 59వ పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ గిప్ట్ గా ఇచ్చిన టయోటా ల్యాండ్‌ క్రూసర్‌ ధీని ఖరీదు 1.19కోట్లు. రేంజ్‌ రోవర్‌ వోగ్‌ ఈ కారు ధర సుమారు కోటి పైనే ఉంటుంది. ఇవే కాకుండా చిన్న కార్లు చిరు దగ్గర చాలానే ఉన్నాయట.

- Advertisement -

హీరో ఎన్టీఆర్ వాడే ఖరీదైన కార్లు, పోర్స్చ్ 911 కారు ధర కోటిన్నరకు పైనే. మరో రేంజ్ రోవర్ లేటెస్ట్ మోడల్ కారు 2.5 కోట్లు. ‘బెంజ్ 4 మెటిక్’ ధర కోటి ఇరవై లక్షలు. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ లాంబోర్గినీ స్పెషల్ ఎడిషన్ గ్రాఫైట్ కప్సుల్ కారును కొనుగోలు చేసిన విషయం తెలిసిందే దీని దర 3.10 కోట్లు.

హీరో ప్రభాస్‌కు దగ్గర బీఎమ్‌డబ్ల్యూ 520D, ఇన్నోవా క్రిస్టా, జగువార్‌ ఎక్స్‌జేఎల్‌, రేంజ్‌ రోవర్‌ వోగ్‌, రోల్స్‌ రాయ్స్‌ గోస్ట్‌ కార్లు ఉన్నట్లు సమాచారం. తాజాగా ఈ జాబితాలో లంబోర్గిని కారు వచ్చి చేరింది.

హీరో నాగచైతన్యకు కార్లు, బైక్స్ అంటే చాలా ఇష్టం. ఇతనికి 7కార్లు ఉన్నాయి. ఫెరారీ 488జీటీబీ కారు ధర 4కోట్ల40లక్షలు, మెర్సిడెస్ జిఏజి జి 63కారు 2కోట్ల18లక్షలు, మూడో రేంజ్ రోవర్ కార్లు, ఇక నిస్సాన్ జిటిఆర్ కారు ధర 2కోట్ల12లక్షలు, కాగా 5వ కారు ఫెరారీ 430ధర 2కోట్లు, బిఎం డబ్ల్యు ఎఫ్ 5మోడల్ ధర కోటి 55లక్షలు, ఇక ఆఖరుగా 7వ కారు డేన్జ్ జిల్ ఈ ధర 90లక్షలు.

హీరో రానాకు ఆరు కార్లున్నాయి. బిఎం డబ్ల్యు ఎక్స్ 5కారు ధర 82లక్షలు, బెంజ్ ఎస్ క్లాస్ మోడల్ కారు ధర 2కోట్ల55లక్షల రూపాయలు, బెంజ్ సి క్లాస్ కారు ధర 49లక్షల75వేలు, స్కోడా కారు ధర 15లక్షలు, ఫోర్షియో కారు ధర 75లక్షలు, ఆడి ఏ 3మోడల్ కారు ధర 32లక్షలు.

హీరో నాని దగ్గర నాలుగు కార్లు ఉన్నాయి. రేంజ్ రోవర్ మోడల్ కారు ధర 76 లక్షలు, మెర్సిడెస్ బెంజ్ కారు 80లక్షలు, హోర్డ్ సిస్ట్ కారు ధర 8 లక్షలు, ఆడి క్యూ త్రీ కారు 40లక్షలు.

హీరో నితిన్ దగ్గర నాలుగు కార్లు ఉన్నాయి. జాగ్వార్ కారు 63లక్షల 78వేలు, బిఎం డబ్ల్యు ఎం 4 మోడల్ కారు ధర కోటిన్నర, బెంజ్ జిఎల్ 60మోడల్ కారు ధర 90లక్షలు, ఇక నాలగవ కారు ఆడి క్యూ 5మోడల్ కారు ధర 56లక్షల 21వేలు.

హీరో నిఖ్హిల్ దగ్గర మూడు కార్లు ఉన్నాయి. బెంజ్ స్కూప్ మోడల్ ధర 63లక్షలు, రేంజ్ రోవర్ ధర 80లక్షలు, ఇక మూడవ కారు పోర్న్ డి ఎన్ ఓ ధర కోటి 19లక్షలు.

హీరో విజయ్ దేవరకొండ దగ్గర 5 కార్లున్నాయి. ఫోర్డ్ మస్టాంగ్ కారు ధర 74 లక్షలు, బిఎం డబ్ల్యు 350డి కారు ధర 59 లక్షలు, మెర్సిల్స్ జి 300 మోడల్ కారు ధర 52 లక్షలు, ఆడి ఏ 6మోడల్ కారు ధర 54 లక్షలు, ఆడి క్యూ 5 మోడల్ కారు ధర 55 లక్షలు.

హీరో నాగ శౌర్యా దగ్గర నాలుగు కార్లు ఉన్నాయి. ఫోర్షియో 718 కేమాన్ మోడల్ ధర 85 లక్షల 95 వేలు, మెర్సి లెస్ డిమ్ 350డి కారు ధర 88 లక్షల 20 వేలు, బ్లు జాగ్వార్ ఎక్స్ కె మోడల్ కారు 88 లక్షలు, బిఎం డబ్ల్యు 520డి లగ్జరీ కారు 59 లక్షల 34 వేలు.

హీరో వరుణ్ తేజ్ దగ్గర ఆరు కార్లు ఉన్నాయి. వోల్వో ఎక్స్ సి 90మోడల్ కారు కోటి 20లక్షలు, మెర్సి లెస్ బెంజ్ క్లాస్ ధర కోటి 50లక్షలు, ఆడి క్యూ3 ధర 40లక్షలు, టయోటా ఇన్నోవా 30లక్షలు, కొండై వెన్నా కారు ఖరీదు 17లక్షలు, కోడా ధర 25లక్షలు.

హీరో రామ్ దగ్గర 3 కార్లున్నాయి. రేంజ్ రోవర్ కారు ధర 90 లక్షలు, బిఎం డబ్ల్యు ఎక్స్ 3కారు ధర 58 లక్షలు, మెర్సి లెస్ బెంజ్ క్లాస్ ధర కోటి 36లక్షలు.

Also Read

మోస్ట్ పాప్యులర్ హీరోయిన్ గా సమంత..

టాలీవుడ్ లో విలన్స్ గా ఎంట్రీ ఇచ్చిన స్టార్ హీరోలు..!

టాలీవుడ్ హీరోయిన్స్ ఎక్కడ.. ఏం చదువుకున్నారో తెలుసా ?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -