Thursday, May 2, 2024
- Advertisement -

అతనితో సహజీవనం చేసిన‌ మాట వాస్త‌వ‌మే – న‌టి నీలాని

- Advertisement -

త‌మిళ‌నాట సహాయ దర్శకుడు గాంధీలలిత కుమార్ ఆత్మ‌హ‌త్య పెద్ద సంచ‌ల‌న‌మే సృష్టించింది. గాంధీలలిత కుమార్ ఆత్మ‌హ‌త్య వెన‌కు ఓ న‌టి కూడా ఉంద‌ని తెలుస్తుంది పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే….నటి నీలాని త‌మిళంలో సీరియ‌ల్స్‌లో న‌టిస్తు మంచి పేరు సంపాదించింది.లలిత్ కుమార్ కూడా నటుడు ఉదయనిధి స్టాలిన్ సంస్థలో పని చేసే అవకాశం వచ్చింది.దీంతోపాటు కొన్ని సినిమాల‌కు స‌హయ ద‌ర్శ‌కుడిగా కూడా ప‌నిచేశాడు లలిత్ కుమార్. సీరియ‌ల్స్‌లో న‌టిస్తున్న స‌మ‌యంలోనే లలిత్ కుమార్‌తో ప‌రిచియం ఏర్ప‌డింది.ఈ ప‌రిచియం కాస్తా ప్రేమ‌గా మారింది.ఇద్దరూ కలిసి సహజీవనం కూడా చేశారు. అయితే కొంతకాలం తరువాత లలిత్ కుమార్ కి పని లేకుండా పోవడంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి.

దీంతో నీలాని లలిత్ కుమార్‌కు దూరంగా ఉంటుంది.కొంత‌కాలం క్రితం లలిత్ కుమార్ వేధిస్తున్నాడని మైలాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది నీలాని.నీలాని తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిందని మనస్తాపం చేసిన లలిత్ కుమార్ ఆత్మహత్యకి పాల్పడ్డారు. దీంతో నీలాని మంగళవారం సాయంత్రం చెన్నై పోలీస్ కమీషనర్ కార్యాలయానికి వెళ్లి లలిత్ కుమార్ ఆత్మహత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పింది.మీడియా ముందుకొచ్చిన నీలాని లలిత్ కుమార్ తో తనకు సంబంధం ఉన్న మాట నిజమేనని, ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నామని చెప్పింది. లలిత్ కుమార్ తనను వేధించిన కారణంగానే పోలీస్ కంప్లైంట్ చేశానని, డబ్బు తీసుకొని మోసం చేశాడని వెల్లడించింది. మ‌రి ఈ వివాదం ఎంత దూరం వెళ్తుందో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -