Saturday, May 18, 2024
- Advertisement -

ధ‌ర్మాబాద్ కోర్టుకు హాజ‌ర‌వ‌డంపై కీల‌క నిర్ణ‌యం తీసుకున్న బాబు…

- Advertisement -

బాబ్లీ ప్రాజెక్టు వ్యతిరేక ఆందోళనల కేసుకు సంబంధించి ఏపీ సీఎం చంద్ర‌బాబుతో స‌హా 16 మందికి నాన్‌బెయిల‌బుల్ అరెస్ట్ వారెంట్లు ధ‌ర్మాబాద్ కోర్టు జారీ చేసిన సంగ‌తి తెలిసింది. ఈనె 21న కోర్టుకు స్వ‌యంగా హాజ‌రు అవ్వాల‌ని వారెంట్ల‌లో కోరింది. అయితే దీనిపై చంద్ర‌బాబు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.

దీనిపై పలువురితో చర్చించిన అనంతరం లాయర్‌ను పంపించాలని, రీకాల్ పిటిషన్ వేయాలని నిర్ణయించారు. దీంతో బాబు ద‌ర్మ‌దాబాద్ కోర్టుకు వెల్ల‌డంలేద‌ని ప్ర‌భుత్వం తెలిపింది. ఈ కేసుకు సంబంధించి చార్జ్ షీట్, నాన్ బెయిలబుల్ వారెంట్ సహా ఇతర పత్రాలను మహారాష్ట్ర పోలీసుల నుంచి తీసుకోవాలని నిర్ణయించింది.

చంద్రబాబు నాయుడు సహా 16 మందికి మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు గత గురువారం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. బాబ్లీ ప్రాజక్టుకు వ్యతిరేకంగా 2010లో చేసిన పోరాటానికి గాను ఈ వారెంటును జారీ చేసింది. గ‌తంలో అనేక సార్లు కోర్టుకు హాజ‌రు అవ్వ‌ల‌ని సూచించా బాబు ప‌ట్టించుకోక‌పోవ‌డంతోనే అరెస్ట్ వారెంట్ల‌ను జారీచేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -