Saturday, May 11, 2024
- Advertisement -

షాకింగ్ః సైనికుడిగా బన్నీ నటనకు బ్రేక్ వేసిన పశ్ఛిమ బెంగాల్ ముఖ్యమంత్రి

- Advertisement -

అల్లు అర్జున్ హీరోగా వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం నా పేరు సూర్య…… నా ఇల్లు ఇండియాకు దిమ్మతిరిగే షాక్. అల్లు అర్జున్ ఎంతో ఇష్టపడి చేస్తున్న సైనికుడి క్యారెక్టర్‌కి ఇప్పటికే సూపర్ అప్లాజ్ వస్తోంది. ఫస్ట్ ఇంపాక్ట్‌తో పాటు ఈ సినిమా స్టిల్స్ అన్నీ కూడా సినిమా లవర్స్‌ని చాలా చాలా ఆకట్టుకుంటున్నాయి. అందుకే యూనిట్ మొత్తం కూడా చాలా ఉత్సాహంగా ఉంది.

ఆ ఉత్సాహంతోనూ సినిమా షూటింగ్‌ని ఇంకా సహజ ప్రాంతాల్లో చేయాలని యూనిట్ అంతా కూడా డార్జిలింగ్ వెళ్ళింది. మైనస్ 12 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో సహజ వాతావరణంలో రిస్క్ చేసి మరీ షూట్ చేయడానికి రెడీ అయిన బన్నీ టీంకి ఇప్పుడు పశ్ఛిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వం నంచి షాకింగ్ ఆర్డర్స్ వచ్చాయి. షూటింగ్ ఆపేయాల్సిందిగా స్థానిక పోలీసులు ఆర్డర్స్ పాస్ చేశారు. విషయం ఏంటా అని ఆరా తీసిన బన్నీ టీంకి ఆర్డర్స్ పాస్ అవడం వెనకాల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ టూర్ ఉందని తెలిసింది. మమతా బెనర్జీ డార్జిలింగ్‌లో పర్యటించనున్న నేపథ్యంలో నాలుగు రోజుల పాటు షూటింగ్ ఆపేయాల్సిందిగా స్థానిక పోలీసులు నా పేరు సూర్య యూనిట్‌కి ఆర్డర్స్ పాస్ చేశారు. ఎంతో శ్రమకోర్చి షూటింగ్‌‌కి అన్ని ఏర్పాట్లూ చేసుకున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ఇలా స్పందించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తాం అని అస్తమానం చెప్తూ ఉండే ప్రభుత్వాధినేతలే పర్యాటక అభివృద్ధికి ఎంతో సహాయకారి అయ్యే ఇలాంటి కార్యక్రమాలను అడ్డుకోవడం ఏంటని నేషనల్ మీడియా కూడా ప్రశ్నిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -