Monday, May 6, 2024
- Advertisement -

ప్రత్యేక హోదాపై ద్రోహం చేసినవాళ్ళకు 2019ఎన్నికల్లో బుద్ధి చెప్పండిః హీరో నిఖిల్

- Advertisement -

చంద్రబాబునాయుడితో సహా టిడిపి నేతలందరూ కూడా ప్రత్యేక హోదా విషయంలో ఎంత మాయ చేశారో, ఎంత మోసం చేశారో చెప్పనవసరం లేదు. నరేంద్రమోడీ కంటే ముందు చంద్రబాబే ప్రత్యేక హోదా వేస్ట్ అని మాట్లాడేశాడు. ఇక బాబు భజన మీడియా మొత్తం కూడా అదే పాట అందుకుంది. ఆ తర్వాత బిజెపి నేతలు కూడా పరమానందంగా అదే పాట అందుకున్నారు. మొత్తంగా 2014ఎన్నికల సమయంలో హోదా పేరు చెప్పి మోడీకి ఓట్లు వేయించడంతో పాటు, టిడిపికి కూడా ఓట్లేయించుకున్న చంద్రబాబు రెండేళ్ళు తిరిగేసరికి ఆంధ్రప్రదేశ్ ఓటర్లను నిలువునా ముంచేశాడు. ఇక మేధావుల ఫోరం అని చెప్పుకునే చల్లా శ్రీనివాస్, లోక్ సత్తా జేపీ….ఇంకా ఈ బ్యాచ్ అంతా కూడా ఈ విషయంలో బాబును పల్లెత్తు మాట అనరు. అంతా ఒకే తాను ముక్కలే కదా. ఇక సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఆంధ్రప్రదేశ్ హీరోలు కూడా అంతా బాబు భజన బ్యాచే. లేకపోతే బాబుకు భయపడేవాళ్ళే. అందుకే ఎవ్వరూ హోదా గురించి మాట్లాడరు. భజనసేనుడు పవన్ కళ్యాణేమో హోదా వద్దు-ప్యాకేజ్ ముద్దు అన్న చంద్రబాబును పల్లెత్తు మాట అనడు. కానీ బాబు కింద పనిచేస్తూ, బాబు మోచేతి నీళ్ళు తాగుతూ ఉండే నాయకులను మాత్రం తూతూ మంత్రంగావిమర్శించి ప్రజల ముందు బ్రహ్మాండంగా నటిస్తూ ఉంటాడు. వీళ్ళందరికంటే తెలంగాణా ప్రాంత నటుడు అయినప్పటికీ సంపూర్ణేష్ బాబు చాలా బెటర్ అనిపించాడు హోదా ఉద్యమం సమయంలో.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌తో సంబంధం లేని మరో తెలుగు నటుడు నిఖిల్ కూడా ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని స్పందించాడు. ఆంధ్రప్రదేశ్‌లో తాను సినిమా షూటింగ్‌ల కోసం తిరిగానని ……పూర్తిగా వెనుకబడిపోయి ఉందని, కనీస అభివృద్ధి కూడా లేదని చెప్పుకొచ్చాడు నిఖిల్. చంద్రబాబు, పచ్చ మీడియా చూపిస్తున్న అభివృద్ధి మాయను ఆ రకంగా కొట్టిపడేశాడు. ఆ వెంటనే పచ్చ బ్యాచ్ కొందరు నిఖిల్‌కి కౌంటర్స్ ఇవ్వడానికి ట్రై చేశారు. నువ్వు ఉద్యమం చెయ్యొచ్చు కదా అని ఎకసెక్కాలు ఆడారు. అయితే నిఖిల్ మాత్రం అస్సలు తగ్గకుండా హోదా కోసం ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేదని……సంవత్సరంలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ప్రత్యేక హోదా విషయంలో ద్రోహం చేసిన పార్టీలను చిత్తుగా ఓడిస్తే సరిపోతుందని చెప్పుకొచ్చాడు నిఖిల్. సీమాంధ్ర టిడిపి, బిజెపి నేతలకు ఇంతకుమించిన హెచ్చరిక ఏముంటుంది? హోదా విషయంలో ముంచేశారు. ప్యాకేజ్‌కి దిక్కులేదు. గ్రాఫిక్స్ బొమ్మలు తప్ప అమరావతిలో శంకుస్థాపన గుంతల తవ్వకం కూడా ప్రారంభం కాలేదు. ప్రత్యేక హోదా అవసరం లేదు అని చంద్రబాబు మోడీ భజన చేసిన రోజే ఆంధ్రప్రదేశ్ ఐదేళ్ళ కాలాన్ని పూర్తిగా నష్టపోయిందని రాజకీయ విశ్లేషకులు ఘంటాపథంగా చెప్తున్నారు. హీరో నిఖిల్ బాధ్యతగా ఆలోచించినట్టుగా 2019ఎన్నికల్లో మాత్రం ప్రత్యేక హోదా విషయంలో ద్రోహం చేసిన పార్టీలను మాత్రం ఆంధ్రప్రదేశ్ ఓటర్లు చిత్తు చిత్తుగా ఓడిస్తారేమో చూడాలి మరి. లేకపోతే ఇకపై దేశంలోని ఏ రాజకీయ పార్టీ అయినా ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడానికి, ఓటర్లను అడ్డంగా మోసం చేయడానికి అస్సలు వెనకాడదు అని చె్ప్పడానికి సందేహం అక్కర్లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -