Friday, May 17, 2024
- Advertisement -

ద‌మ్ముంటే నన్ను అరెస్ట్ చేసుకోండంటూ పాక్ ప్ర‌భుత్వానికి స‌వాల్‌విసిరిని ఉగ్ర‌వాది హ‌ఫీజ్

- Advertisement -

అంత‌ర్జాతీయ ఉగ్ర‌వాది ముంబ‌య్ పేళుల్ల సుత్ర‌ధారి జమాత్ ఉద్ దవా (జుద్) చీఫ్ హ‌ఫీజ్ సయీద్ పాకిస్థాన్ ప్రభుత్వానికి సవాలు విసిరారు . ద‌మ్ముంటే న‌న్ను అరెస్ట్ చేసుకోవాల‌ని స‌వాల్ విసిరారు. కశ్మీర్ ప్రజల కోసం తన పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని మ‌రో సారి హ‌ఫీజ్ స్పష్టం చేశారు. ఒకవేళ పాకిస్థాన్ ప్రభుత్వం నన్ను అరెస్టు చేయాలనుకుంటే వచ్చి అరెస్టు చేసుకోవచ్చు. కానీ, కశ్మీరీల కోసం నేను ఈ ఏడాదంతా అంకితం చేసి తీరుతాని చేసిన వ్యాఖ్య‌లు ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి.

లాహోర్‌లో ర్యాలీ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్య‌లు చేశారు. తమను అణగదొక్కాలని చూస్తే మరింత మమేకమై ముందుగు సాగుతామని ఆయన స్పష్టం చేశారు. హఫీజ్‌ను ప్రత్యేకమైన అంతర్జాతీయ ఉగ్రవాదిగా అమెరికా ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. హఫీజ్ పనిలో పనిగా పాకిస్థాన్ పదవీచ్యుత ప్రధాని నవాజ్ షరీఫ్‌పై కూడా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కశ్మీర్ సమస్య పరిష్కారానికి సరైన రీతిలో నవాజ్ తన పాత్రను సమర్థవంతంగా పోషించలేదని ఆయన విమర్శించారు.

అమెరికా, భారత్ నుండి వస్తున్న ఒత్తిళ్ల కారణంగా పాకిస్థాన్‌లో తమ మీడియా కవరేజీలు నిషేధానికి గురైనట్లు ఆయన ఆరోపించారు. కాగా, గత నవంబరులో పాకిస్థాన్‌లో గృహనిర్బంధం నుండి విముక్తి పొందిన హఫీజ్‌ తలపై 10 మిలియన్ అమెరికన్ డాలర్ల నజరానాని అమెరికా ప్రభుత్వం ప్రకటించిన సంగతి విదితమే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -