Thursday, May 2, 2024
- Advertisement -

రాహుల్ ని సిగ్గు లేదా అని అడిగిన చిన్మయి

- Advertisement -

అక్కినేని నాగార్జున ప్రధాన పాత్ర లో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం లో వచ్చే నెల విడుదల కానున్న చిత్రం మన్మధుడు 2. ఈ సినిమా కచ్చితంగా అందరినీ ఎంతగానో మెప్పిస్తుంది అనే నమ్మకం తో ఉన్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమా మన్మధుడు 2 అనే పేరు తో వస్తుంది కానీ మొదటి భాగానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు అనే విషయం క్లియర్ గా అర్ధం అయింది. నాగార్జున కూడా ఈ సినిమా ఒక రీమేక్ అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేశాడు. ఈ సినిమా కి సంబందించిన ట్రైలర్ ని మేకర్స్ ఇటీవలే లాంచ్ చేశారు. ట్రైలర్ అందరినీ ఎంతగానో అలరించింది.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ నాగార్జున తో వర్క్ చేయడం కి సంబంధించి తన అనుభవాన్ని పంచుకున్నాడు. సెట్ లో నాగార్జున అంత అందం గా ఇంకెవరూ ఉండరని, అందువలన తనకి ప్రాబ్లమ్ గా ఉండేదని, ఒక రోజు తన భార్య కూడా సెట్స్ పైకి వచ్చి నాగార్జున ని చూసి, తనకి సిగ్గు లేదా అని అడిగింది అని నవ్వుకుంటూ చెప్పాడు.

ఈ సినిమా వచ్చే నెల 9 న విడుదల కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -