Saturday, May 18, 2024
- Advertisement -

151 వ చిత్రం బోయపాటి తో ఫిక్స్ !

- Advertisement -

తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి మళ్లీ రంగేసుకున్నారు. ఖైదీ నెంబర్ 150తో దూసుకొస్తున్నారు చిరు. జూన్ నెలాఖర్లో షూటింగ్ స్టార్ట్ చేయగా.. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తయిపోయింది. రామ్ చరణ్ నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ చిత్రం 2017 సంక్రాంతికి రిలీజ్ కానుంది.

ఇదిలా ఉంటే.. చిరు 151కి కూడా ఏర్పాట్లు జరిగిపోతున్నాయని తెలుస్తోంది. బాస్ ఈజ్ బ్యాక్ అని మెగాభిమానులు ఆనందంలో మునిగి తేలుతుంటే.. ఆ హ్యాపీనెస్ ని మరింతగా పెంచేలా వరుసగా సినిమాలు చేయనున్నారట మెగాస్టార్. ప్రస్తుతం రామ్ చరణ్ ప్రొడ్యూసర్ గా సినిమా చేస్తున్న చిరు.. తన తర్వాతి చిత్రాన్ని గీతా ఆర్ట్స్ కి చేస్తారనే విషయం ఖాయమైపోయింది. మరోవైపు సరైనోడు సక్సెస్ తర్వాత.. తన నెక్ట్స్ మూవీని గీతా ఆర్ట్స్ కే చేస్తానని చెప్పాడట దర్శకుడు బోయపాటి శ్రీను.

ఓ సమయంలో మంచి కథ ఉంటే చెప్పు.. సినిమా చేద్దాం అని బోయపాటికి ఆఫర్ ఇచ్చారు చిరు. ఈ మూడు ఈక్వేషన్స్.. ఇప్పుడు ఒకేసారి నెరవేరబోతున్నాయని  తెలుస్తోంది. చిరంజీవి హీరోగా గీతాఆర్ట్స్ బ్యానర్.. బోయపాటి డైరెక్షన్ లో సినిమా ఖాయమైందని.. ఖైదీ నెంబర్ 150 రిలీజ్ అయిన వెంటనే దీన్ని స్టార్ట్ చేసేస్తారని టాక్ వినిపిస్తోంది. ‘జస్ట్ టైమ్ గ్యాప్ అంతే.. టైమింగ్ లో గ్యాప్ ఉండదు’ అంటూ బ్రూస్ లీ లో డైలాగ్ చెప్పిన చిరు.. 2019 వరకు గ్యాప్ లేకుండా మూవీస్ చేసేస్తారన్నది మెగా టాక్.

Related

  1. పవన్ కళ్యాణ్ స్పీచ్ మొత్తం ఆసక్తిగా చూసిన చిరంజీవి
  2. చిరంజీవి కోసం సాయి ధరం తేజ త్యాగం
  3. ఖైదీ సినిమాలో నిహారిక ?
  4. రామ్ చరణ్ కి ఇది సాధ్యమా ?
  5. మెగాస్టార్ ‘ఖైదీ నెంబర్ 150’ ఫస్ట్ లుక్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -