Saturday, April 20, 2024
- Advertisement -

ఆచార్య ఇంకా ఎన్ని రోజుల షూటింగ్ పెండింగ్ లో ఉందంటే..!

- Advertisement -

సైరా మూవీ తర్వాత చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్న సినిమా ఆచార్య. ఈ సినిమాకు అపజయం ఎరుగని డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి.కరోనా సెకండ్ వేవ్ ప్రభావం వల్ల ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. లేదంటే మే 13వ తేదీన ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది.

ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ప్రభావం మెల్లమెల్లగా తగ్గుతూ వస్తోంది. దీంతో షూటింగ్ ఆగిపోయిన సినిమాలన్నీ వరుసగా సెట్స్ పైకి వెళ్తున్నాయి. ఆచార్య సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు సమాయత్తం అవుతున్నారు. అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలవబోతోందని టాక్. ఈ సినిమాకు సంబంధించి ఇంకో 12 రోజుల పాటు చిత్రీకరణ చేస్తే అక్కడికి షూటింగ్ పార్ట్ కంప్లీట్ అవుతుందట.

దీంతో వీలైనంత త్వరగా మిగిలిపోయిన భాగాన్ని షూట్ చేసి ఆ తర్వాత రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి కి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా, రామ్ చరణ్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఆయనకు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. అందులో చిరంజీవి దేవాదాయశాఖ ఉద్యోగిగా నటిస్తున్నట్లు సమాచారం. ప్లాష్ బ్యాక్ లో వచ్చే ఎపిసోడ్ లో చిరంజీవి, చరణ్ నక్సలైట్లు గా కనిపించనున్నట్లు తెలుస్తోంది.

Also Read

పవన్ మూవీలో పెంచల్ దాస్ పాట..!

ఈ సారైనా నిధి ఫేట్ మారుతుందా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -