Thursday, April 18, 2024
- Advertisement -

ఈ సారైనా నిధి ఫేట్ మారుతుందా?

- Advertisement -

కుర్రాళ్లను ఆకట్టుకునే అందం, మంచి నటన ఉన్నప్పటికీ ఎందుకో నిధి అగర్వాల్ స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకో లేకపోతోంది. వరుసగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అవకాశాలు వస్తున్నప్పటికీ, అగ్ర హీరోల సినిమాల్లో నటిస్తున్నప్పటికీ ఆమె ఆశించిన స్టార్డం, సక్సెస్ మాత్రం రాలేదు. నిధి అగర్వాల్ 2017లో హిందీలో టైగర్ ష్రాప్ హీరోగా నటించిన ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. అదే సంవత్సరం తెలుగులో నాగచైతన్య హీరోగా తెరకెక్కిన సవ్యసాచి సినిమా లో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.

అయితే మొదటి సినిమాతోనే తన గ్లామర్, నటనతో ఆకట్టుకున్న నిధి అగర్వాల్ ఇండస్ట్రీకి వచ్చి నాలుగు సంవత్సరాలు గడిచినా ఎందుకు ఆశించినంత గుర్తింపు తెచ్చుకోలేక పోయింది. అయితే ఇప్పుడు ఆలస్యంగా అయినా నిధి అగర్వాల్ కు వరుసగా అగ్రహీరోల సినిమాల్లో అవకాశాలు అందుతున్నాయి. పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లులో హీరోయిన్ గా నిధి అగర్వాల్ ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాల్లో మంచి అవకాశం దక్కించుకుంది ఈ భామ. ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ పాన్ ఇండియా మూవీలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ కు ఛాన్స్ దక్కినట్లు టాక్.

ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీలో చరణ్ తో కలిసి హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా అతి త్వరలోనే షూటింగ్ ముగియనుంది. ఇది పూర్తయిన తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేయనున్నాడు. ఇది కంప్లీట్ కాగానే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా ప్రారంభించనున్నారు. ఇందులో నటించేందుకు నిధి అగర్వాల్ కు ఛాన్స్ దక్కినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఆ సినిమా మేకర్స్ ఇప్పటికే నిధి అగర్వాల్ తో సంప్రదింపులు జరిపారట. వరుసగా పవన్, ఎన్టీఆర్ నటించే పాన్ ఇండియా సినిమాల్లో నటించే అవకాశం దక్కడంతో ఈ సారైనా తనకు హిట్ దక్కుతుందని నిధి అగర్వాల్ ఆశలు పెట్టుకుంది.

Also Read

మొటిమలు పొగుట్టుకొనేందుకు ఏం చేస్తానంటే? తమన్నా టిప్​..!

ఫ్యామిలీ మ్యాన్​ -3లో క్రేజీ సౌత్​ హీరో..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -